Rishab Shetty Remuneration: 400 కోట్ల కలెక్షన్ల కాంతార మూవీకి రిషబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Rishab Shetty`s Remuneration For Kantara Movie: 400 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన కాంతార మూవీతో రిషబ్ శెట్టి ప్యాన్ ఇండియా ఫుల్ పాపులర్ అయ్యాడు. ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఇంత భారీగా కలెక్షన్స్ రాబట్టిన కాంతార సినిమాను అందించిన రిషబ్కి రెమ్యునరేషన్ ఎంత తక్కువో తెలిస్తే షాక్ అవుతారు
Rishab Shetty's Remuneration For Kantara Movie: రిషబ్ శెట్టి కన్నడ హీరోనే అయినప్పటికీ.. ఇప్పుడు ఇండియాలో ఈ హీరో పేరు తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. కాంతార మూవీతో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను సైతం తన వైపు తిప్పుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. కాంతార మూవీ సక్సెస్ రేటు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేసి, నటించిన కాంతార మూవీ కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ.. ఓటిటి, శాటిలైట్ రైట్స్ లాంటి ఇతర హక్కులు కాకుండానే కేవలం థియేటర్ల ద్వారానే ఈ సినిమా రూ. 406 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
చిన్న బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించి భారీ కలెక్షన్స్ రాబట్టడం ఎలాగో రిషబ్ శెట్టి నుంచి నేర్చుకోవాలి అంటూ భారీ బడ్జెట్ చిత్రాల డైరెక్టర్స్, నిర్మాతలకు కొంతమంది సినీ విమర్శకులు, ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా చురకలు అంటించారు. అంత భారీ వసూళ్లు రాబట్టిన సినిమాను తెరకెక్కించిన రిషబ్ శెట్టి కాంతార మూవీ కోసం ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుని ఉండుంటాడు అనే ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగాయి.
రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవడానికంటే ముందుగా కాంతార మూవీలో ఇతర కీలక పాత్రలు పోషించిన నటీనటుల పారితోషికం ఎంతో కూడా తెలుసుకుందాం. ఆ తరువాత రిషబ్ శెట్టి విషయానికొద్దాం. కాంతార మూవీలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర పోషించిన కిషోర్, రిషబ్ శెట్టి సరసన హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడకు చెరొక కోటి రూపాయలు పారితోషికంగా చెల్లించారు. రాజుకు వారసుడి పాత్రలో కనిపించిన అచ్యుత్ కుమార్ రూ. 40 లక్షలు అందుకున్నాడు. సుదారక పాత్ర పోషించిన ప్రమోద్ శెట్టి 60 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన రిషబ్ శెట్టికి రూ. 4 కోట్ల పారితోషికం చెల్లించారు. కాంతార మూవీని డైరెక్ట్ చేసి, ప్రధాన పాత్రలో నటించినందుకుగాను చిత్ర నిర్మాణ సంస్థ హోంబేల్ ప్రొడక్షన్స్ ఈ రెమ్యునరేషన్ చెల్లించింది. అయితే, కాంతార భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినందుకు హోంబేల్ ప్రొడక్షన్స్ నిర్మాతలు ఏమైనా అధిక పారితోషికం అందించారా లేదా అనే విషయంలోనే స్పష్టత కొరవడింది. ఏదేమైనా కాంతార మూవీతో రిషబ్ శెట్టి మార్కెట్ వ్యాల్యూ మాత్రం భారీగానే పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇకపై రిషబ్ చేయబోయే సినిమాలకు అంతకు రెట్టింపు పారితోషికం అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇది కూడా చదవండి : Vijay - Samantha : అమ్మాయిల డ్రీమ్ బాయ్, అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. ఎప్పుడైనా ఈ విషయం గమనించారా?
ఇది కూడా చదవండి : Samantha Losing Chances: సమంతను ఆ నిర్మాతలు అందుకే పక్కన పెడుతున్నారా ?
ఇది కూడా చదవండి : Rangasthalam Auditions: ఆరోజు అనుపమ వాళ్ల అమ్మ అక్కడ లేకుంటే సమంత ప్లేస్ అనుపమదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook