Kantara Dominates Ori Devuda, Prince, Sardar and Ginna Collections: దీపావళి సందర్భంగా ఈ సారి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా, విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమా, శివకార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ సినిమా, అలాగే సర్దార్ అంటూ కార్తీ నటించిన సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాస్తవానికి ఈ నాలుగు సినిమాలు బాగానే ఉన్నాయి. నాలుగు సినిమాలకు మంచి టాక్ కూడా లభించింది. అయితే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సినిమాలు చాలా వెనుకబడ్డాయని చెప్పాలి.
ఇక ఈ వారం నాలుగు సినిమాలలో ఏది ఎంత కలెక్ట్ చేసిందనే విషయానికి వస్తే సర్దార్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 95 లక్షలు, రెండో రోజు కోటి ఐదు లక్షలు, మూడవరోజు కోటి 48 లక్షలు, నాలుగో రోజు కోటి 32 లక్షలు, ఐదో రోజు 64 లక్షలు, ఆరవ రోజు 44 లక్షలు, ఏడవ రోజు 26 లక్షలు వెరసి మొత్తం ఆరు కోట్ల 14 లక్షలు షేర్ 10 కోట్ల పాతిక లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఐదు కోట్ల యాభై లక్షలు కాగా ఆ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి ప్రస్తుతానికి 64 లక్షల లాభాల్లో దూసుకుపోతోంది. ఇక మరో పక్క విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమా విషయానికి వస్తే మొదటి రోజు 90 లక్షలు, రెండో రోజు 66 లక్షలు, మూడవరోజు 74 లక్షలు, నాలుగో రోజు 90 లక్షలు, ఐదో రోజు 39 లక్షలు, ఆరవ రోజు 26 లక్షలు, ఏడవ రోజు 18 లక్షలు వసూలు చేసి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల మూడు లక్షల షేర్, 6 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
కర్ణాటక సహా మిగతా ప్రాంతాల్లో 11 లక్షలు, ఓవర్సీస్ లో 61 లక్షలు వెరసి మొత్తం నాలుగు కోట్ల 75 లక్షలు షేర్, 8 కోట్ల 55 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా 6 కోట్ల నిర్ణయించారు. ప్రస్తుతం సాధించిన దానికంటే ఇంకా కోటి పాతిక లక్షలు వసూలు చేస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్ సంపాదిస్తుంది. ఇక శివ కార్తికేయన్ ప్రిన్సు సినిమా విషయానికి వస్తే మొదటి రోజు 90 లక్షలు, రెండో రోజు 46 లక్షలు, మూడవరోజు 41 లక్షలు, నాలుగో రోజు 60 లక్షలు, 5వ రోజు 27 లక్షలు, ఆరవ రోజు 14 లక్షలు, ఏడవ రోజు 8 లక్షలు వెరసి మొత్తం రెండు కోట్ల 86 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. అలాగే ఐదు కోట్ల 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ఇక ఈ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల 86 లక్షలు వసూలు చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏడు కోట్ల నిర్ణయించడంతో ఇంకా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలు వసూలు చేస్తేనే హిట్ గా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ స్థాయి వసూళ్లు చేయడం కష్టమనే చెప్పాలి. ఇక మంచు విష్ణు జిన్నా విషయానికి వస్తే మొదటి రోజు 12 లక్షలు, రెండో రోజు 10 లక్షలు, మూడవ రోజు రెండు లక్షలు, నాలుగో రోజు 11 లక్షలు, 5వ రోజు ఏడు లక్షలు, ఆరవ రోజు 14 లక్షలు, ఏడవ రోజు రెండు లక్షలు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 లక్షలు షేర్, కోటి ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 58 లక్షల షేర్ కోటి 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది, ఇక సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా నాలుగు కోట్లు నిర్ణయించడంతో ఇంకా మూడు కోట్ల 42 లక్షల వసూలు చేస్తే కానీ ఈ సినిమా హిట్ అనిపించుకోవడం కష్టమే.
ఈ నాలుగు సినిమాల్లో సర్దార్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి ముందుకు వెళ్లడమే గాక మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే ఈ నాలుగు సినిమాల కంటే ఒక వారం ముందే విడుదలైన కాంతార ముందుకు దూసుకుపోతోంది. ఈ నాలుగు సినిమాలకు ఏడవ రోజు అంటే గురువారం నాడు కాంతార 49 లక్షలు వసూలు చేసి సత్తా చాటింది.
అయితే జిన్నా, ఓరి దేవుడా, ప్రిన్స్, సర్దార్ సినిమాలు కలిపి 7వ రోజు 54 లక్షలు వసూలు చేస్తే కాంతార ఒక్కటే 49 లక్షలు వసూలు చేయడం గమనార్హం. ఈ సినిమాని తెలుగులో కేవలం రెండు కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రెండు కోట్ల 30 లక్షలు నిర్ణయించారు. ఇప్పటికే ఆ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమా 14 కోట్ల 70 లక్షల దాకా లాభాలు తీసుకువచ్చిందని చెబుతున్నారు. మొత్తం మీద కాంతార దెబ్బ ఆ సినిమాలకు గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది.
Also Read: Pawan Kalyan mistake: అన్నను చూసి కూడా అర్ధం చేసుకోని పవన్.. మరో తప్పు చేసేందుకు రెడీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook