Rangasthalam Auditions: ఆరోజు అనుపమ వాళ్ల అమ్మ అక్కడ లేకుంటే సమంత ప్లేస్ అనుపమదే..

Director Sukumar Reveals Rangasthalam Auditions: రంగస్థలం సినిమాలో సమంత కంటే ముందు ఆ రోల్ కోసం అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నామని, అయితే ఆడిషన్స్ లో ఆమె వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండడం భయం వేసిందని చెప్పుకొచ్చారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 20, 2022, 02:49 PM IST
Rangasthalam Auditions: ఆరోజు అనుపమ వాళ్ల అమ్మ అక్కడ లేకుంటే సమంత ప్లేస్ అనుపమదే..

Director Sukumar Reveals Rangasthalam Auditions of Anupama Parameshwaran: కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 18 పేజెస్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.

దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ హాజరైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకి సుకుమార్ స్వయంగా కథ అందించడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. గతంలో అలాగే సుకుమార్ కథ అందించి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన కుమారి 21ఎఫ్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని అందరూ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అదేమంటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించాల్సి ఉందని ఈ సందర్భంగా సుకుమార్ బయట పెట్టారు. అప్పుడు ఆడిషన్స్ నిర్వహించిన సమయంలో ఆమె మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండేదని అది చూసి తనకు భయం వేసింది అని సుకుమార్ చెప్పకు వచ్చారు.

అప్పటికి అనుపమ పరమేశ్వరన్ చిన్న పిల్ల అని ఆ చూడడం సహజమే కానీ ఎందుకో తాను రిస్క్ చేయడానికి ప్రయత్నించలేదని అని అన్నారు. అయితే ఎప్పటికైనా మనం ఒక సినిమా చేద్దామని పేర్కొన్న సుకుమార్ నీకు తెలుగు రావడం గొప్ప విషయం అని నువ్వు చాలా గ్రేట్ టాలెంట్ ఉన్న అమ్మాయివి, చాలా అద్భుతమైన నటివి అన్ని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. 

Also Read: Pushpa Russia Release: 'పుష్ప' భజన మాములుగా లేదు కానీ.. మూడు కోట్లు లాసా?

Also Read: Thunivu in Telugu: అజిత్ 'తెగింపు'.. నాలుగు సినిమాలతో పోటీ పడ్డా భారీ రేటు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News