RK Roja Slams Balakrishna on Dialouges against AP Govt: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశం మీద నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ అందులో ఎలాంటి తప్పు లేదని ఏపీలో పరిస్థితులనే సినిమాలో డైలాగులుగా పెట్టాము తప్ప కొత్తగా ఏమీ సృష్టించలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ఆయన కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆయన మాటలకు కౌంటర్లు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇదే విషయం మీద మాట్లాడిన మంత్రి రోజా బాలకృష్ణకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో అనేది అర్థం కావడం లేదని అన్నారు. ఒకవేళ బాలకృష్ణ గత ప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఏపీ ఎమర్జెన్సీలోలా ఉందని అనుకుంటున్నారేమో అంటూ ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని, అయినా స్క్రిప్టులు రాసిచ్చినా మాట్లాడలేని పరిస్థితిలో బాలకృష్ణ ఉన్నారని ఆమె అన్నారు. చంద్రబాబు కారణంగా 11 మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన ఆమె అసలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు జీవో నెంబర్ వన్ పూర్తిగా చదివారా అని ప్రశ్నించారు.


జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదం అని ఆమె పేర్కొన్నారు. బాలకృష్ణ తన అల్లుడు, కూతురు బాగుండాలని బాబు బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండవచ్చని మొన్నటికి మొన్న అన్ స్టాపబుల్ ల్లో ఎన్టీఆర్ గురించి జరిగిన చర్చ మీద కూడా ప్రజలందరూ ఇది స్క్రిప్ట్ అని భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మోసాన్ని కప్పిపుచ్చే విధంగా ఆ షో మొత్తం సాగిందని ఆమె ఆరోపించారు. ఎవరు చచ్చినా పర్వాలేదు నా బావ మీటింగ్ జరగాలి, నా బావ కళ్ళల్లో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.  


బాలకృష్ణకు ప్రజల కష్టాలు తెలియవా? పవన్ కళ్యాణ్ లాగా మీరు రెండు సార్లు ఓడిపోలేదు కదా రెండుసార్లు మీరు గెలిచారు, అయినా మీకు ప్రజల కష్టాలు తెలియవా అని ఆమె ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా అని ఆమె ప్రశ్నించారు. ఇక మూడు పంటలు పండే అమరావతి భూమిని ఎవరో స్వామీజీ చెప్పారని బీడు భూమిగా మార్చారని ఆమె విమర్శించారు.


తనను మహిళా సదస్సుకు  పిలిచి చంపించాలని చూశారని ఆరోపించిన ఆమె జీవో నెంబర్ వన్ గురించి పూర్తిగా చదివితే బాలకృష్ణ తాను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారని రోజా పేర్కొన్నారు. అసలు ఎమర్జెన్సీ అనడమే సిగ్గుచేటని నీతిమాలిన చర్య అని రోజా అభివర్ణించారు. సినిమాలో ఎన్ని డైలాగులు చెప్పినా చప్పట్లు కొట్టుకోవడానికి తప్ప ప్రజల ఊర్లు బాగుపడమని ఆమె అన్నారు. ఇక ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి పరిస్థితిలో ఎలా మారబోతున్నాయి అనేది.


Also Read: Rajeev Kanakala Charecter Died: వీర సింహా రెడ్డి సహా “రాజీవ్ కనకాల” చనిపోయే పాత్రలు చేసిన 14 సినిమాలు. ఇవే!


Also Read: Chiranjeevi Emotional: మీ అందరి అకుంటిత కృషే వాల్తేరు వీరయ్య విజయానికి కారణం..చిరు ఎమోషనల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook