Rocking Rakesh-Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్ తో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమాయాణం..త్వరలోనే పెళ్లి!
Rocking Rakesh-Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్ రాకేష్, యాంకర్ సుజాతల పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకుందాం.
Rocking Rakesh-Jordar Sujatha: రాకింగ్ రాకేష్ (Rocking Rakesh).. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనాధన్ ధనరాజ్ టీంలో మెంబర్ గా చేరి..ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. చిన్న పిల్లలతో స్కిట్ చేయించడంలో రాకేష్ దిట్ట. తాజాగా ఈ నటుడు ప్రేమలో పడ్డట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.
కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్ ట్రాక్ నడుపుతాయి. మరికొన్ని నిజంగానే ప్రేమలో పడతాయి. అలాంటి జోడీనే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ (Love) ట్రాక్ నడుస్తోందంటూ నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఈ జంట తమది రియల్ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేశాడు.
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత (Jordar Sujatha) బిగ్‌బాస్ సీజన్-4లో (Bigg Boss Season 4) పాల్గొన్నడం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోల్లో చేస్తోంది సుజాత. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్‌తో కలిసి జబర్ధస్త్ (Jabardasth)లో పలు స్కిట్లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారని...వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి