Bheemla Nayak Day 1 Collections: రికార్డులు సృష్టిస్తున్న 'బీమ్లా నాయక్' కలెక్షన్స్.. 'పుష్ప'ని దాటేసిన బీమ్లా

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 10:47 AM IST
  • శుక్రవారం వరల్డ్ వైడ్ గా'భీమ్లా నాయక్‌' రిలీజ్
  • సుమారు 1900 థియేటర్లలో విడుదల
  • తొలి రోజు రికార్డు వసూళ్లు నమోదు
Bheemla Nayak Day 1 Collections: రికార్డులు సృష్టిస్తున్న 'బీమ్లా నాయక్' కలెక్షన్స్.. 'పుష్ప'ని దాటేసిన బీమ్లా

Bheemla Nayak Box Office Collection:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) చిత్రం వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో.. ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు  1900 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఒక్క యూఎస్ లోనే 400కుపైగా థియేటర్లలో, 3వేలకుపైగా స్క్రీన్ లలో సినిమాను విడుదల చేశారు. 

ఈ చిత్రం అన్ని జీఎస్‌టీ రిటర్న్‌లతో సహా రూ. 108 కోట్ల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కేవలం థియేట్రికల్ రన్‌లో దాదాపు 140 – 160 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. మురళీశర్మ, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

'భీమ్లా నాయక్‌' ఫస్ట్ డే (Bheemla Nayak first day Collections) దాదాపు రూ. 35-40 కోట్లు వసూలు చేశాడు. తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 26 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ నుండి రూ. 50-55 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం కర్ణాటకలో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. అంతేకాదు ఓటీటీ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Also Read: Bheemla Nayak Mania: భీమ్లా నాయక్ మాస్ జాతర- థియేటర్లలో ఫ్యాన్స్ సందడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News