Anupama Parameswaran's latest pics goes viral: 'ప్రేమమ్' అనే మలయాళీ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాతో తెలుగులో కూడా హిట్ అవ్వడంతో తెలుగులో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఆపై ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, శతమానం భవతి, తేజు ఐ లవ్ యూ, రాక్షసుడు, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేశారు. తన అందం, నటనతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి 2022కి విడుదలైన దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి నటించిన 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ముఖ్యంగా లిప్ లాక్ (Lip Lock) సీన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటిసారి ఈ సినిమా కోసం లిమిట్స్ క్రాస్ చేశారు. ఒకటి రెండు కాదు రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా ఐదు లిప్ లాక్ సీన్స్ చేశారు.


Also Read: Cameron Boyce Double Hat-Trick: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌!!


అనుపమ పరమేశ్వరన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబందించి అప్ డేట్స్ ఇస్తుంటారు. అంతేకాదు తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంటారు. అనుపమ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలకు (Anupama Parameswaran Latest Pics) ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అద్దం ముందు నిల్చున్న అను.. క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్నారు. ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి. 



దీపం ఉన్నపుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములాను అనుపమ పరమేశ్వరన్ ఫాలో అవుతున్నారు. 'రౌడీ బాయ్స్‌' మూవీలో కొత్త హీరోతో లిప్‌లాక్ సీన్ల‌లో న‌టించి రెచ్చిపోయిన అను.. భారీగానే పారితోషికం తీసుకున్నారట. రౌడీ బాయ్స్ మూవీకి అనుప‌మ‌కు రూ.50 ల‌క్ష‌ల పారితోషికం అప్ప‌జెప్పార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ఇంచుమించు పాతిక ల‌క్ష‌ల్లోపే రెమ్యున‌రేష‌న్ అందుకునే అనుకు ఇదు కెరీర్‌లో హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ అని తెలుస్తోంది. ఇక అను ప్రస్తుతం తెలుగులో '18 పేజీలు', 'కార్తికేయ 2' చిత్రాల్లో నటిస్తున్నారు. 


Also Read: IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook