Cameron Boyce Double Hat-Trick: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌!!

బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ కామెరాన్ బోయ్స్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 10:19 AM IST
  • 4 బంతుల్లో 4 వికెట్లు
  • డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌
  • టీ20 క్రికెట్లో మూడో బౌలర్‌గా రికార్డు
Cameron Boyce Double Hat-Trick: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌!!

Cameron Boyce takes double hat-trick in BBL: టీ20 ఫార్మాట్ (T20 Cricket) అంటే బ్యాటర్లదే హవా. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచి ఆఖరి బంతివరకు బౌండరీల వర్షం కురుస్తుంటుంది. ఫోర్లు, సిక్సులతో శివాలెత్తుతుంటారు. ఈ క్రమంలోనే బ్యాటర్లు అలవోకగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేస్తుంటారు. టీ20ల్లో ఎక్కువగా బలయ్యేది బౌలర్లే. ఒక్కోసారి బ్యాటర్ చెలరేగితే ఒకే ఓవర్లో 36 పరుగులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే అద్భుత బంతులు వేస్తే బౌలర్లు కూడా టీ20లో చెలరేగవచ్చని ఆస్ట్రేలియా (Australia) స్పిన్నర్ క్యామెరూన్ బాయ్స్ (Cameron Boyce) చేసి చూపించాడు.

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ (Melbourne Renegades) లెగ్‌ స్పిన్నర్‌ కామెరాన్ బోయ్స్ అరుదైన ఘనత అందుకున్నాడు. బుధవారం సిడ్నీ థండర్స్ (Sydney Thunder) జట్టుతో జరిగిన మ్యాచులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ (Double Hat-Trick) నమోదు చేశాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి అలెక్స్‌ హేల్స్‌ను ఔట్‌ చేసిన బోయ్స్.. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లోని మొదటి మూడు బంతులకు జాసన్‌ సంఘా, అలెక్స్‌ రాస్‌, డేనియల్‌ సామ్స్‌లను వెనక్కి పంపాడు.

Also Read: U-19 World Cup - Covid 19: టీమిండియాలో కరోనా కలకలం.. కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్‌! సూపర్ లీగ్ దశకు అర్హత!

అలెక్స్‌ రోస్‌ను ఔట్‌ చేయడం ద్వారా హ్యాట్రిక్‌ సాధించిన కామెరాన్ బోయ్స్‌.. బీబీఎల్‌ టోర్నీలో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతికే మరో వికెట్‌ తీసిన బోయ్స్‌.. డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. దాంతో బీబీఎల్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా బోయ్స్‌ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా టీ20 క్రికెట్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచాడు. క్రికెట్ ఆటలో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అంటరాని తెలిసిందే. అదేవిధంగా వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొడితే.. డబుల్ హ్యాట్రిక్‌గా పరిగణిస్తారు. 

సిడ్నీతో జరిగిన మ్యాచులో కామెరాన్ బోయ్స్‌ ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్  లసిత్ మలింగ అంతర్జాతీయ మ్యాచులో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. తాజాగా బాయ్స్ కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

క్యామెరూన్ బోయ్స్‌ మొత్తం 5 వికెట్లు పడగొట్టినా సిడ్నీ థండర్స్ జట్టు చేతిలో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ టీంకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో మెల్‌బోర్న్‌ రెనిగెడ్స్ 169 పరుగులకే మాత్రమే పరిమితమైంది. దీంతో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.

Also Read: IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News