RRR Actors Jr NTR and Ram Charan Joins with Sahiba Bali in North Indian vs South Indian Spicy Food Challenge: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా (Pan India Movie) వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌‌తో పాటు మేకింగ్ వీడియోలు, పాటలు అదిరిపోయాయి. జనవరి 7న ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) రిలీజ్‌ అవుతోన్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచేసింది మూవీ యూనిట్. జొమాటో (Zomato) యూట్యూబ్‌ ఛానెల్‌లో తళుక్కుమన్నారు ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, (Jr NTR) రామ్ చరణ్ (Ram Charan). నార్త్ ఇండియన్ వర్సెస్‌ సౌత్ ఇండియన్ స్పైసీ ఫుడ్ ఛాలెంజ్ (North Indian vs South Indian Spicy Food Challenge) అనే కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. హెస్ట్‌ సాహిబా బాలి (Sahiba Bali) వీరితో రచ్చరచ్చ చేసింది. 


నాటు నాటు సాంగ్ (Natu Natu Song) హిందీ వెర్షన్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు ఈ యంగ్‌ హీరోలు. ఇది మరింత స్పైసీగా ఉంటుంది అంటూ హెస్ట్‌‌కు ఒక వంటకాన్ని వడ్డించారు ఎన్టీఆర్‌‌. తర్వాత చరణ్ నేను ప్రేమిస్తున్నాను అంటూ హెస్ట్‌ సాహిబా బాలి చెప్తారు. హెయ్ చరణ్ నాకు లవ్ యూ టూ మీ చెప్పాడంటూ హెస్ట్‌ అంటుంది.


నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ పాటకు చరణ్‌తో కలిసి స్టెప్‌లు వేసింది హెస్ట్‌ సాహిబా బాలి. చరణ్ ఆ పాటకు స్టెప్‌లు ఎలా వేయాలో ఆమెకు నేర్పించారు. ఫైనల్ గా స్టెప్స్ చేసి యాంకర్ సాహిబా.. హెయ్‌ నేను నాటు నాటు సాంగ్ కు స్టెప్స్ వేశాను అంటూ ఆనందంలో తేలిపోయింది. ఇలా మస్త్ ఫన్నీగా.. ఎంటర్‌‌టైన్‌మెంట్‌తో సాగింది ప్రోమో. త్వరలోనే ఈ కార్యక్రమం ఫుల్ ఎపిసోడ్ అప్‌లోడ్ కానుంది. 



 


Also Read : Stock Market today: వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్​- సెన్సెక్స్​ 191 మైనస్​
ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో (RRR Movie) చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనుంది ఆలియా. తారక్‌కు జతగా ఒలీవియా మోరీస్‌ నటించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ మూవీని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.


Also Read : Harbhajan Singh: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్పిన్నర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook