Hollywood Fans trolling RRR Movie: దర్శకధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తుందంటే.. సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ప్రేక్ష‌కులు ముందే డిసైడ్ అయిపోతారు.  సినిమా హిట్ గురించి ఆలోచించకుండా.. జ‌క్క‌న్న నుంచి ఇదివ‌ర‌కు వచ్చిన సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా అని మాత్ర‌మే మాట్లాడుకుంటారు. అంతలా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. మ‌గ‌ధీర సినిమాతో రికార్డులు మొదలెట్టిన రాజ‌మౌళి.. బాహుబ‌లితో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఇక జ‌క్కన్న ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1920 బ్రిటిష్ నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కల్పిత గాధగా తెరకెక్కించారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం దోస్తీ చేస్తే ఎలా ఉంటుందనే కల్పిత అంశంతో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఇద్దరి మధ్య స్నేహన్ని చాలా ఎమోషన్‌గా చూపించారు. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం, బ్రోమాన్స్ బాగా పండింది. ఇండియన్ ఫాన్స్ బాగా ఫిదా అయ్యారు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ చిత్రంను ఆకాశానికి ఎత్తారు. 


హాలీవుడ్‌కు ధీటుగా భారత సినిమాలు వస్తున్నాయి. దాంతో హాలీవుడ్ ఫాన్స్, వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, ట్వీట్స్ ద్వారా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహాన్ని 'గే రిలేషన్‌షిప్' అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కొన్నిచోట్ల 'గే రొమాన్స్' మూవీ అనిపిస్తోంది అంటూ ఓ వెస్ట్రన్ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'ఆర్ఆర్ఆర్ సినిమాలో మతిపోగోట్టే యాక్షన్, అడ్వెంచర్, రివేంజ్ ఉన్నాయి. ఇది నిజమే. కానీ ఇది గే సినిమా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిపై ఇండియన్స్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈచిత్రం బాక్సాఫీస్ ముందు బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా రూ. 1200 కోట్ల మార్కును దాటేసింది. అలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో నటించారు. కీరవాణి అందించిన సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది.  


Also Read: Kamal Haasan Remuneration: 'విక్రమ్‌' సినిమా కోసం.. కమల్‌ హాసన్‌ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా?  


Also Read: IND vs SA: ఫామ్‌లో దక్షిణాఫ్రికా త్రయం.. టీమిండియా గెలవడం కష్టమే! రాహుల్ సేన గెలిస్తే చరిత్రే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook