RRR Hoardings Across USA: ఆర్ఆర్ఆర్ సంబురాలు షురూ.. అమెరికా అంతటా ఎన్టీఆర్ హోర్డింగులు
ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ప్రమోషన్ లలో స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. అదేవిధంగా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కూడా ప్రమోషన్ లలో పోటీ పడుతున్నారు. అమెరికాలో రామ్, భీమ్ పోస్టర్లతో అదరగొట్టేస్తున్నారు..
RRR Hoardings Across USA: ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల తేదీ మార్చి25 దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్స్ జోరు పెరుగుతోంది. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్యా ప్రచారంలో పోటాపోటీ నెలకొంది. ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ అభిమానులు ఒక విధంగా ప్రచారం చేస్తే... మేం కూడా తగ్గేదేలే అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ మరొక విధంగా ప్రచారం సాగిస్తున్నారు.
తాజాగా అమెరికాలోని ఎన్టీఆర్ అభిమానులు ఓ ట్వీట్ చేశారు. డాలస్‌లో ఎన్టీఆర్ హోర్డింగులు పెద్దయెత్తున ఏర్పాటు చేశారు. ఇది కేవలం చిన్న శాంపిల్ మాత్రమేనని, అమెరికాలోని ప్రధాన నగరాల్లోని పలు చోట్ల హోర్డింగులు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. తొక్కుకుంటూ పోవాలె అనే హాష్ ట్యాగ్ జోడించి.. ఎన్టీఆర్ అభిమానులు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానలకు పోటీగా.. ఓవర్సీస్‌లోని రామ్ చరణ్ అభిమానులు కూడా తమదైన శైలిలో జోరుగా ఆర్ఆర్ఆర్ ప్రచారం సాగిస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు తమకు నచ్చిన స్టైల్లో ప్రమోట్ చేస్తూ సినిమాకు మరింత హైప్ పెంచేస్తున్నారు. ఎన్టీఆర్ కోసం ఆయన ఫ్యాన్స్ కెనడాలో కార్లతో భారీ ర్యాలీ చేశారు. ఆర్.ఆర్.ఆర్ టార్చ్ బేరర్ ఎన్టీఆర్ అంటూ కెనడా, యుఎస్‌ఏలో అభిమానులు చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్‌చరణ్ ఫ్యాన్స్ కూడా ఎముకలు కొరికే చలిలో గంటకు 30 మైళ్ల వేగంతో ఈదుర గాలుల మధ్య పిట్స్‌బర్గ్‌లో రామ్‌చరణ్ అభిమానులు ప్లే కార్డ్స్‌తో హంగామా చేశారు. ఆర్‌ఆర్‌ఆర్.. టీమ్ రామ్‌చరణ్.. యూఎస్‌ఏ అంటూ పిక్స్ తీసి పోస్ట్ చేశారు. దాదాపు 15 కుటుంబాల సభ్యులు, పిల్లలు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ విడుదలతోపాటు చెర్రీ పుట్టినరోజు కూడా ఇదే నెలలో ఉండడంతో అభిమానులు సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.
Also Read: Jhulan Goswami ODI Wickets: చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా క్రికెటర్ జులన్ గోస్వామి!
Also Read: Ananya nagalla Pics: అనన్య నాగళ్ల అందంతో మతి పోగొట్టే బ్యూటీ అమె సొంతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook