Prabhas reacts on Pan India rivalry with JR NTR, Ram Charan and Yash: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమా 'బాహుబలి' 1, 2 ఎంతటి ఘన విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది చిత్రాలు సైతం పాన్ ఇండియా లెవల్‌లో సత్తాచాటుతాయని బాహుబలితో రుజువైంది. బాహుబలి విజయం మరింతమంది దర్శకనిర్మాతలను పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచించేలా చేసింది. ఈ క్రమంలోనే పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి సినిమాలు వచ్చాయి. తాజాగా కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 పాన్ ఇండియా లెవల్లో ఘన విజయం అందుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 గంటలకు జీ సినిమాలో రాధేశ్యామ్ (హిందీ) చిత్రం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రత్యేక టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్‌.. పలు విషయాలపై స్పదించాడు. రామ్‌ చరణ్, ఎన్టీఆర్, యశ్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారా? అనే ప్రశ్నకు ప్రభాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'ఎక్కడైనా పోటీ సహజం. అయితే అది మనం అనుకుంటేనే. ప్రస్తుతం మంచి సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. మా తాత 'మైనే ప్యార్ కియా' సినిమా చూసి సల్మాన్‌ ఖాన్ అభిమానిగా మారారు. ఎప్పట్నుంచో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాస్త ఎక్స్‌పోజర్ ఎక్కువైంది' అని రెబల్ స్టార్ అన్నాడు. 


ప్రభాస్‌ ఇంకా మాట్లాడుతూ... 'మేమందరం కలిసి భవిష్యత్తులో చాలా భారతీయ సినిమాలు చేయబోతున్నాం. నిజానికి మనం భారతీయ సినిమాని కూడా దాటబోతున్నాం. పాన్ ఇండియా చిత్రాలను తీయడం ఇప్పటికే ఆలస్యం అయ్యిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడే అది ప్రారంభమైంది. ఉత్తరాది, దక్షిణాది నటులందరం కలిసి భారతీయ చిత్రాలను చేయబోతున్నాం. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని మంచి సినిమాలు వస్తాయని నాకు నమ్మకం ఉంది' అని ధీమా వ్యక్తం చేశాడు. 


ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూశారా? అని అడగ్గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఇలా బదులిచ్చాడు. 'ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలవడం సంతోషముగా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ ఎస్‌ఎస్‌  రాజమౌలి దక్షిణాది దర్శకుడు కాదు భారతీయ డైరెక్టర్. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఇప్పటికే 1100-12000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మంచి హిట్ అయినందుకు ఆనందంగా ఉంది' అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. 


Also Read: TS RTC charges: బస్సు ప్రయాణికులకు షాక్​.. పెరిగిన ఆర్టీసీ టికెట్​ రిజర్వేషన్ ఛార్జీలు!


Also Read: పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook