RRR Movie Jr NTR's Revolt Of BHEEM Komuram Bheemudo song out now : ఆర్ఆర్ఆర్‌‌ మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్‌ మామూలుగా లేదు. వెంట వెంటనే కిరాక్‌ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది ఆర్ఆర్ఆర్‌ చిత్ర బృందం. ప్రమోషన్స్‌ విషయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ (RRR Team) దూసుకెళ్తోంది. ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన సౌత్ లో, బాలీవుడ్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి మూవీని ప్రమోట్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఆర్ఆర్ఆర్‌‌ మూవీ నుంచి నాలుగో పాట కూడా వచ్చేసింది. కొమరం భీమ్ (Komaram Bheem) ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించిన ఈ పాట సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొమురం భీముడో (Komuram Bheemudo) అంటూ సాగే ఈ ఎన్టీఆర్‌‌ పాట ఎంతో ఆకట్టుకుంటోంది. భావోద్వేగంతో సాగే ఈ పాట ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. కాల భైరవ (kaala bhairava) పాడారు. ఎంఎం కీరవాణి (MM Keeravani) మ్యూజిక్ అందించారు. భీమా నిన్నుగన్న నేల తల్లి... ఊపిరి పోసిన చెట్టు చేమ.. పేరు పెట్టిన గోండు జాతి అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో పాట ప్రారంభం అవుతుంది. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న కొమరం భీమ్ లిరికల్ వీడియోలో సింగర్ కాల భైరవ పాడుతూ కనిపిస్తాడు.



 


ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా మూవీ (Periodical action drama) ఆర్ఆర్‌ఆర్‌ను దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జనవరి 7న (January 7) ఈ మూవీ ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కానుంది.


Also Read :Christmas 2021: క్రిస్మస్ పండుగ రోజున ఎంతో ఇష్టంగా తినే వంటకాలేంటో తెలుసా?



ఇక డిసెంబర్‌‌ 9న రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ట్రైలర్‌‌కు విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిసి బ్రిటిష్‌ వారిపై ఎలా పోరాటం చేశారనే కోణంలో ఫిక్షనల్‌ స్టోరీగా జక్కన్న ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ (Alia Bhatt) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఆలియా చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనుంది. తారక్‌కు జోడిగా ఒలీవియా మోరీస్‌ నటించింది. ఆర్ఆర్ఆర్ మూవీని (RRR Movie) డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ మూవీని నిర్మించారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.


Also Read :RBI New Rule: కొత్త పేమెంట్​ రూల్స్ అమలు జనవరి 1 నుంచి కాదు.. కొత్త తేదీ ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook