RBI New Rule: ఆన్లైన్ చెల్లింపులను మరింత సురక్షితం (Safe online transactions) చేసేందుకు ఆర్బీఐ (RBI new Rules) తీసుకొచ్చిన కొత్త రూల్స్ అమలు చేసే విషయంపై కొత్త అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ కొత్త రూల్స్ అమలు తప్పనిసరి చేసే గడువును పొడగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొత్త రూల్స్ అమలు తప్పనిసరి చేసే తేదీ ఇంతకు ముందు 2022 జనవరి 1 గా ఉండగా.. ఇప్పుడు ఆ తేదీని 2022 జులై 1కి మార్చింది.
ఇంతకి ఏమిటి ఈ కొత్త రూల్స్..
ఈ-కామర్స్ దిగ్గజాలు, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు తమ పేమెంట్ గేట్‌వేలలో వినియోగదారుల క్రెడిట్, డిబిట్ కార్డ్‌ల వివరాలు సేవ్ చేసుకోకుండా నియంత్రించడమే ఈ కొత్త నిబంధనల (What are RBI new Rules) ఉద్దేశం. ఇందులో భాగంగా ఆయా సంస్థలు తమ గేట్‌వేల నుంచి యూజర్ల పేమెంట్ వివరాల డేటా బేస్‌ను తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ.
ఈ ఆదేశాల ప్రకారం.. పేమెంట్ చేసే ప్రతి సారి వినియోగదారులు డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి.. దీనికి బదులు టోకనైజేషన్ వాడుకోవచ్చని తెలిపింది.
టోకనైజేషన్ అంటే?
క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను బహిర్గతం చేయకుండా.. ఆన్లైన్ షాపింగ్,సహా ఇతర మాధ్యమాల్లో వాటిని వినియోగించేందుకు (What is Tokenisation) ఉపయోగపడేదే ఈ టోకనైజేషన్. పేమెంట్ చేసే సమయంలో టోకనైజేషన్ సదుపాయం ద్వారా కోడ్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది క్రెడిట్, డెబిట్ కార్డ్ సేవలందించే.. మాస్టర్, వీసా, రూపే వంటి పేమెంట్ సంస్థలు అందిస్తాయి.
ఇలా జెనరేట్ చేసిన కోడ్‌నే టోకెన్ అంటారు. ఈ టెకెన్ను పేమెంట్ కోసం వినియోగించుకోవచ్చు. పొరపాటున ఈ కోడ్ బయటకు వచ్చిన ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే అదనపు అథెంటికేషన్ ద్వారా మాత్రమే ఈ పద్దతిలో లావాదేవీ పూర్తవుతుంది. కాబట్టి ఇది చాలా సురక్షితమని భావిస్తోంది (Tokenisation uses) ఆర్బీఐ.
ఆయితే టోకనైజేషన్ వాడుకోవడం తప్పనిసరే కాదు. వినియోగదారులు ఇష్టమైతేనై ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. లేదా ప్రతి సారి మాన్యువల్‌గా కార్డ్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా పేమెంట్ పూర్తి చేయొచ్చు. టోకనైజేషన్ సేవలు పొందేందుకు ఎలాంటి ఛార్జీలు కూడా ఉండవు.
Also read: Year ending 2021: డిసెంబర్ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?
Also read: Bank Holidays December 2021: ఆరు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏఏ రోజుల్లో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook