RRR Collaboration With PVR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం లోగోనే మార్చేసిన పీవీఆర్ సంస్థ
RRR Collaboration With PVR: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ లోగోలో సినిమా పేరు వచ్చే విధంగా పీవీ‘ఆర్ఆర్ఆర్’ అని లోగోను మార్చింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా కోసం ప్రముఖ సంస్థ పేరు మార్చుకోవడం ఇదే తొలిసారి.
RRR Collaboration With PVR: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలయ్యేందుకు (RRR Movie Release Date) సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం తమ లోగోనే మార్చేసింది ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్. తమ లోగోలోని చివరి 'ఆర్' స్థానంలో ఈ సినిమా పేరును చేర్చి.. పీవీ'ఆర్ఆర్ఆర్'గా నామకరణం చేసింది. దీనికి సంబంధించిన కార్యక్రమం శుక్రవారం ముంబయిలోని అంధేరీలో జరిగింది. ఈ కార్యకమంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, కార్తికేయ రాజమౌళి హాజరయ్యారు. డైరెక్టర్ రాజమౌళి ఈ లోగోను ఆవిష్కరించారు.
అయితే ఓ సినిమా కోసం తమ సంస్థ పేరు మార్చుకోవడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశముంది. మన దేశంలోని పీవీఆర్‌కు చెందిన 850కి పైగా స్క్రీన్లతో పాటు 70కి పైగా నగరాల్లో ఉన్న 170కి పైగా బిల్డింగ్‌లపై PV'RRR' అనే పేరు (PVR News) దర్శనమివ్వనుందని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది.
భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (RRR Movie Cast) నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. రూ.450 కోట్లతో (RRR Movie Budget ) నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి (RRR Movie Release Date) రానుంది.
Also Read: Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు
Also Read: Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook