Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం

Puneeth Rajkumar Death LIVE Updates: పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్.. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 04:10 PM IST
  • కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరన్న వార్తతో అంతటా విషాదం
  • తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన అభిమానులు
  • బెంగళూరు కంఠీరవ స్టేడియానికి పునీత్‌ పార్థీవ దేహం
Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం

Puneeth Rajkumar Death LIVE Updates: Fans Can Pay Last Respects at Bengaluru's Kanteerava Stadium; India Mourns: కన్నడ పవర్‌ స్టార్‌ (kannada power star) పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరన్న వార్తతో సినీ ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రి (Vikram Hospital) వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్.. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులకు సముదాయించడం పోలీసులకు సవాల్‌గా మారింది.పునీత్‌ ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు (heart attack) గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. 

Also Read : IRCTC Share News Today: కేంద్రం నిర్ణయంతో పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేర్లు 

పునీత్‌ మృతి నేపథ్యంలో కర్ణాటకలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్‌ (Puneeth Rajkumar) పార్థీవ దేహాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడియంలో (Bengalurus Kanteerava Stadium) ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

Also Read : CM YS Jagan: ప్రతి గ్రామానికి ఇంటర్‌‌నెట్, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్‌ సమీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News