NTR Comments on Ram Charan: ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అన్ని భాషల్లోనూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల చెన్నై ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌ బుధవారం కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురంలో (Thiruvananthapuram) వేడుకను నిర్వహించింది. మలయాళ నటుడు టొవినో థామస్‌ (మిన్నల్‌ మురళి ఫేం) ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజమౌళి, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్ మాట్లాడారు.


హీరో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. "నా ‘ధీర’ (మగధీర) సినిమాను మీరెంతగానో ఆదరించారు. కానీ, మీ ప్రేమకు కానుకగా ఎలాంటి వేడుకల్ని నిర్వహించలేకపోయాం. 'చరణ్‌ కేరళ ప్రజలు నీపై ఎంతో ప్రేమ కురిస్తున్నారు. నవ్వు తప్పకుండా అక్కడికి వెళ్లాలి' అని రాజమౌళి చెప్తుండేవారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో అది ఇప్పుడు కుదిరింది. కేరళ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడి ఆహారం నాకెంతో ఇష్టం. మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన టెక్నిషియన్స్‌ ఉన్నారు. మేం.. మీ దర్శకులు, నటులను ఇష్టపడతాం. మీ సినిమాల నుంచి మేం స్ఫూర్తిపొందుతాం. ఎన్టీఆర్‌ నాలో సగభాగం. తను లేనిదే ఈ చిత్రం లేదు" అని అన్నారు.


జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. "చలన చిత్ర పరిశ్రమకు తమిళనాడు (తమిళ చిత్ర పరిశ్రమ) షెల్టర్‌ ఇస్తే టెక్నాలజీ విషయంలో కేరళ (మలయాళ చిత్ర పరిశ్రమ) జన్మనిచ్చింది. కేరళ చిత్ర పరిశ్రమకు ఎంతోమంది గ్రేట్‌ టెక్నీషియన్లను అందించింది. రాజమౌళి చెప్పినట్టుగా 'సింహాద్రి' కొంతభాగం షూటింగ్‌ ఇక్కడే జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది. అతిథిగా విచ్చేసిన నా బ్రదర్‌ టొవినో థామస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వల్ల నేనూ చరణ్‌ స్నేహితులం కాలేదు. అంతకు ముందే మేం ఫ్రెండ్స్‌. మా స్నేహం వల్లే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సాధ్యమైంది. 200 రోజులు నా సోదరుడి (Ram Charan) తో గడిపే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్‌ చెబుతున్నా. మా బంధం 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు. మేమెప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తున్నా" అని అన్నారు.


డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. "ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత దానయ్యగారికి ధన్యవాదాలు. నాతో ఓ సినిమా చేసేందుకు ఆయన చాలా సంవత్సరాలు ఎదురుచూశారు. తన చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలవుతుంటే దర్శకుడికి అంతకుమించిన ఆనందం ఏముంటుంది. నా సినిమాల్ని అన్ని భాషలవారు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 'ధీర', 'ఈచ', 'బాహుబలి' చిత్రాలకు కేరళలో విశేష స్పందన లభించింది. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కేరళ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ సుమారు 25  రోజులు 'సింహాద్రి' సినిమా చిత్రీకరించాం" అని నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. వేడుకకు విచ్చేసిన టొవినో థామస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  


Also Read: Krithi Shetty Photos: నీ నవ్వు చాలు బేబమ్మ.. కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేయడానికి!


Also Read: Jai Balayya Song Craze: 'జై బాలయ్య' సాంగ్ క్రేజ్.. బాలకృష్ణ పాటకు చిందులేసిన ఫారెన్ గర్ల్స్- వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి