Jai Balayya Song Craze: 'జై బాలయ్య' సాంగ్ క్రేజ్.. బాలకృష్ణ పాటకు చిందులేసిన ఫారెన్ గర్ల్స్- వీడియో వైరల్

Jai Balayya Song Craze: బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. ఈ నేపథ్యంలో సినిమాలోని 'జై బాలయ్య' సాంగ్ కు ముగ్గురు విదేశీ అమ్మాయిలు చిందులేసిన వీడియో తెగ వైరల్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 10:39 AM IST
Jai Balayya Song Craze: 'జై బాలయ్య' సాంగ్ క్రేజ్.. బాలకృష్ణ పాటకు చిందులేసిన ఫారెన్ గర్ల్స్- వీడియో వైరల్

Jai Balayya Song Craze: నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత తెరుచుకున్న థియేట‌ర్ల‌కు ఊపిరిపోసిందీ 'అఖండ' సినిమా. నాలుగో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతూ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

ఇక ఈ సినిమాలో యాక్టింగ్‌, డ్యాన్స్ అన్నీ ఇర‌గ‌దీశాడు బాల‌య్య‌. ముఖ్యంగా జై బాల‌య్య సాంగ్‌లో మాస్ స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టాడు. ఈ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్‌గా మారింది. దీనికి నెటిజ‌న్లు త‌మదైన స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో హీరోయిన్ నివేదా థామ‌స్ తో పాటు మరో వీడియోలో ఫారెన్ గర్ల్స్ ఈ పాటకు చిందులేశారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

సోష‌ల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే న‌టి నివేదా థామ‌స్‌.. త‌ర‌చూ పోస్టులు, వీడియోలు పెడుతూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటుంది ఈ భామ‌. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల రిలీజై.. సూప‌ర్ హిట్ అయిన 'అఖండ' సినిమాలోని జై బాల‌య్య పాట‌ను కాపీ కొడుతూ డ్యాన్స్ చేసింది. ఆ పాట‌లో బాల‌కృష్ణ వేసిన స్టెప్పులను అచ్చం అలాగే వేసింది. 

ఒక‌దాని త‌ర్వాత మ‌రో ష‌ర్ట్ విప్పేసుకుంటూ వెళ్లే డ్యాన్స్ మూమెంట్‌ను నివేదా థామ‌స్ ట్రై చేసింది. మొద‌టి ష‌ర్ట్ మారే వ‌ర‌కు డ్యాన్స్ బాగానే చేసింది నివేదా థామ‌స్‌. కానీ రెండో ష‌ర్ట్ మార్చుకునేప్పుడే బెడిసికొట్టింది. స్టెప్పు వేసేట‌ప్పుడు ష‌ర్ట్ స‌రిగ్గా రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌న్ క్రియేట్ చేస్తూ ఆ డ్యాన్స్ మూమెంట్‌ను అలాగే వేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియ‌న్స్ అదిరిపోయింది అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఇది ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

నివేదా థామస్ డ్యాన్స్ చేసిన వీడియోతో పాటు ముగ్గురు విదేశీ అమ్మయిలు 'జై బాలయ్య' సాంగ్ కు స్టెప్పులేశారు. దానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు యూట్యూబ్ లో షేర్ చేశారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణసంస్థ ద్వారక క్రియేషన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బాలయ్యకు ఉన్న క్రేజ్ ఖండాంతరాలను ఎప్పుడో దాటి పోయిందని పోస్ట్ పెట్టింది. దాంతో పాటు ఆ ముగ్గురు అమ్మాయిలు వేసిన డ్యాన్స్ వీడియో చిత్రబృందం షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరూ చూసేయండి.  

Also Read: Sri Reddy Comments on Samantha: 'ఆమె బట్టలు విప్పినా అక్కడ ఏమి ఉండవు'.. సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read: Guess Who is She: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News