RRR Movie Trailer Release: నిన్నటి వరకూ అఖండ ట్రెండింగ్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలపై తెగ ట్రోల్ చేస్తున్నారు. ట్రైలర్ నిడివి ఎంత సేపుందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా ట్రైలర్ మరి కాస్సేపట్లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని ధియేటర్లలో విడుదలవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ జోరందుకుంటోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ చర్చే నడుస్తోంది. మరి కాస్సేపట్లో అంటే 10 గంటలకు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం సిద్ధమైంది. ఇప్పటికే ఏ నగరంలో ఏ ధియోటర్లో ట్రైలర్ విడుదలవుతుందనే జాబితా వైరల్ అవుతోంది. 


ట్రైలర్ ఎంతసేపు, ఏముంది


ఈ నేపధ్యంలో సినిమా ట్రైలర్ గురించి, విడుదల టైమింగ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ (RRR Movie Trailer Release)విడుదల అంశం భారీగా ట్రెండ్ అవుతోంది. సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్‌లో విడుదల కానుంది. ఇవాళ వివిధ నగరాల్లో మీడియా సమావేశాలు కూడా ఏర్పాటయ్యాయి.ట్రైలర్ కోసం విడుదల చేసిన పోస్టర్‌పై చర్చ ప్రారంభమైంది. ట్రైలర్‌లో పులి ఫైట్ హైలైట్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఫైట్ ఆందరికీ ఆకట్టుకునే విధంగా చిత్రీకరించినట్టు సమాచారం. ట్రైలర్ నిడివి కూడా దాదాపు  184 సెకన్లు ఉందని తెలుస్తోంది. ఎమోషన్ ప్రధానంగా కన్పించేలా  ట్రైలర్ ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు ట్రైలర్‌లో అలియా భట్(Alia Bhatt), అజయ్ దేవ్‌గణ్‌లపై ఫోకస్ ఉందని తెలుస్తోంది. 


మరోవైపు ట్విట్టర్, ఇతర మాధ్యమాల్లో ట్రైలర్ విడుదల సమయంపై చర్చ నడుస్తోంది. టెన్షన్ ఎందుకు...యూట్యూబ్‌లో కూడా పది గంటలకే విడుదల చేయవచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమందైతే సాయంత్రవరకూ ఎందుకు..ధియేటర్‌లో విడుదలైన అరగంటకు యూట్యూబ్‌లో పెట్టేయ్యవచ్చు కదా అంటున్నారు.


Also read: Sai Pallavi: సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్, వైరల్ అవుతున్న ట్వీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook