Sai Pallavi: సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్, వైరల్ అవుతున్న ట్వీట్

Sai Pallavi: అక్షరాల సిరులు కురిపించిన సిరివెన్నెల మరణ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. సిరివెన్నెల పాటపై ప్రముఖ నటి సాయిపల్లవి చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2021, 09:32 AM IST
  • సిరివెన్నెల సీతారామశాస్త్రిపై సాయి పల్లవి ఎమోషనల్ ట్వీట్
  • శ్యామ్ సింగరాయ్‌లో ఆఖరి పాట రాసిన సిరివెన్నెల
  • రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకువస్తోందంటూ సాయి పల్లవి వ్యాఖ్య
Sai Pallavi: సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్, వైరల్ అవుతున్న ట్వీట్

Sai Pallavi: అక్షరాల సిరులు కురిపించిన సిరివెన్నెల మరణ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. సిరివెన్నెల పాటపై ప్రముఖ నటి సాయిపల్లవి చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలో కోలుకేలని విషాదాన్ని నింపుతూ ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఆయన రాసిన పాటలు ప్రతి నోటా తిరుగుతూనే ఉన్నాయి. చివరిపాట రాసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆ సినిమా ప్రొమోషన్ సందర్భంగా ప్రముఖ నటి, శ్యామ్ సింగరాయ్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) చేసిన ట్వీట్ ఇప్పుడు ఎమోషనల్ అవుతోంది. 

మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకువస్తుంది. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు అంటూ సాయి పల్లవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy)సినిమాలో సిరివెన్నెల పేరుతో రాసిన పాటే సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆఖరి పాటగా మారింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది. డిసెంబర్ 24 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు కథానాయికలుగా, నాని హీరోగా నటించారు. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వరుసగా సినిమాలు పాటల్ని విడుదల చేస్తున్నారు

Also read: Jacqueline Fernandez photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైరల్ ఫోటోలు.. గ్యాలరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News