RRR Nominated to Oscars in General Category by Production House: మెగా హీరో రామ్ చరణ్ తేజ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను డివివి దానయ్య సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి నెలలో విడుదల సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సుమారు 1150 కోట్లు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా భారత దేశ ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలబడే అవకాశం ఉందంటూ ముందు ప్రచారం జరిగింది. భారతదేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఈ సినిమాని పంపే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ను హైదరాబాద్ వచ్చినప్పుడు అమిత్ షా స్పెషల్ గా కలవడంతో ఇక ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా ఉంటుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఒక గుజరాతీ సినిమాని భారతదేశం నుంచి అఫీషియల్ ఎంట్రీ గా పంపించారు.


దీంతో తెలుగు భాషాభిమానులు అలాగే రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్, రాజమౌళి వంటి వారి అభిమానులు అందరూ బాధపడ్డారు. అయితే అప్పట్లోనే ఈ సినిమాను అమెరికాలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆస్కార్ కు జనరల్ కేటగిరీలో నామినేట్ చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎట్టకేలకు అదే విషయం నిజమైంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


తమ సినిమా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తమ సినిమాని ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ చేస్తున్నామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా రామ్ చరణ్ తేజ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. పలు ఇతర పాత్రలలో అజయ్ దేవగన్, శ్రేయ, అలిసన్ డూడ్లీ, రాహుల్ రామకృష్ణ వంటి వారు నటించారు. 


Also Read: Ram Charan Getting Trolled: మాట తప్పిన రామ్ చరణ్.. దారుణంగా ఆడుకుంటున్న నెటిజన్లు!


Also Read: Ban Adipurush: ఆదిపురుష్ బ్యాన్ చేయండి.. టీజర్ రిలీజ్ చేసిన అయోధ్య ప్రధాన పూజారి షాకింగ్ డిమాండ్!
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook