బాబాయ్ Pawan Kalyan స్ఫూర్తితో రామ్ చరణ్ విరాళం
తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని కరోనాపై పోరాటానికి సాయం చేస్తున్నట్లుగా రామ్ చరణ్ ప్రకటించడం గమనార్హం. ఈ విషయాన్ని Upasana Kamineni సైతం ట్వీట్ చేశారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా వైరస్ (CoronaVirus)పై పోరాటానికి తనవంతు సాయంత ప్రకటించారు. తన బాబాయ్ పవర్ స్టార్, జనసేనత అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని కరోనాపై పోరాటానికి సాయం చేస్తున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తన వంతు సాయంగా రూ.70 లక్షల విరాళం ఇస్తున్నట్లుగా చెర్రీ ట్వీట్ చేశారు. కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి
కేంద్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ.70 లక్షల విరాళం అందిస్తున్నట్లు తన ట్వీట్‌లో తెలిపారు. కరోనా సమయంలో విశేష సేవలందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీని, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. జైహింద్ అంటూ ట్వీట్ ముగించారు. కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తన వంతు సాయంగా చెరో 50 లక్షలు, ప్రధాని సహాయ నిధికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో పవన్ అందజేయనున్నారు. టాలీవుడ్ నుంచి మొదటగా హీరో నితిన్ రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధిగా రూ.10 లక్షల చొప్పున అందజేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
RRR ఫ్యాన్స్‌కు ఉగాది కానుక.. రౌద్రం.. రుధిరం.. రణం
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone