ప్రముఖ పాన్ ఇండియా చిత్రం, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుని..ఇప్పుడు ఆస్కార్ నామినేషన్‌కు నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో గెల్చుకుంది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట. ఇప్పుడిదే పాట ఆస్కార్ నామినేషన్లలో షార్ట్‌లిస్ట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఆస్కార్ అధికారిక నామినేషన్ల ప్రకటన అనంతరం చిత్ర నటీనటులు అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు స్పందించారు. 


ఎస్ఎస్ రాజమౌళి స్పందన


మా పెద్దన్నయ్య నా సినిమాలో పాటకు ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికయ్యాడు. ఇంతకంటే ఎక్కువ ఆశించలేను. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కంటే ఎక్కుగా నాటు నాటు చేస్తున్నాను. ఆస్కార్ వేదికపై మనపాట ఎంపిక కావడంపై చంద్రబోస్ గారికి శుభాకాంక్షలు. ప్రేమ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు. అద్బుతమైన స్టెప్స్ ఇచ్చినందుకు.  ఇక పాట పాడిన రాహుల్, భైరవ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలా పేరుపేరునా టీమ్‌లో అందరికీ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. 


రామ్‌చరణ్ స్పందన


ఇది నిజంగా బ్రిలియంట్ న్యూస్. ఆస్కార్ వేదికకు నాటు నాటు పాట నామినేట్ కావడం నిజంగా అరుదైన గౌరవం. దేశానికి మరోసారి గర్వించే అద్భుత క్షణాలివి. ఎంఎం కీరవాణి గారికి, రాజమౌళి గారికి, నా సోదరుడు తారక్‌కు, మొత్తం ఆర్ఆర్ఆర్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు.


జూనియర్ ఎన్టీఆర్ స్పందన


ఎంఎం కీరవాణి గారికి, లిరిక్స్ రాసిన బోస్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. మరో అరుదైన ఘనత సాధించినందుకు కృతజ్ఞతలు. ఈ పాట నా హృదయంలో ఎప్పటికీ నిల్చిపోతుంది. 


అటు ఆలియా భట్ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లలో నిలిచినందుకు తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో సంగీత దర్శకుడు కీరవాణి సైతం ఆర్ఆర్ఆర్ బృందానికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 


Also read: Glimpse Of SAINDHAV : సైంధవుడిగా వెంకీమామ.. శైలేష్ కొలను మరో ప్రయోగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook