RRR ఫ్యాన్స్‌కు ఉగాది కానుక.. రౌద్రం.. రుధిరం.. రణం
RRR Logo with Motion Poster దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా RRR సినిమా టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా అందించారు.
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బహుబలి లాంటి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ‘జక్కన్న’ తీస్తున్న మూవీ కావడంతో RRRపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో RRR మూవీ యూనిట్ ఉగాది కానుక అందించింది. RRR మూవీ అప్‌డేట్‌పై ఫన్నీ ట్రోల్స్.. నవ్వకుండా ఉండండి చూద్దాం!
ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగోను మోషన్ పోస్టర్‌తో విడుదల చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్‌లు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో జతకట్టిన విషయం తెలిసిందే.
Photos: ‘సాహో’ బ్యూటీ అందాల సునామీ