RRR trailer launching live updates: ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ పాల్గొంది. ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్ర పోషించిన యంగ్ టైగర్ తారక్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హిందీ ఆడియెన్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలని చాలా కోరికగా ఉందని తారక్ తన మనసులో మాటను బయటపెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ మూవీపై హిందీ ఆడియెన్స్ రియాక్షన్ గురించి తారక్ ప్రస్తావించిన నేపథ్యంలో తారక్ ఇంకా ఏమేం చెప్పాడని తెలుసుకోవడానికి ముందుగా ఆయ అభిమానుల (NTR fans about RRR trailer) దృష్టి ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ ట్రైలర్‌పై పడింది. ఒకసారి ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దామా మరి. 



ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి హిందీ సినిమా విమర్శకులు, ఆడియెన్స్ (Bollywood celebrities about RRR trailer)  ఎలా రిసివ్ చేసుకుంటారు, పర్‌ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది అని చెప్పుకొచ్చాడు. దేశంలోని ప్రముఖ నటీనటులతో కలిసి నటించాలి అనే కోరిక ఆర్ఆర్ఆర్ సినిమాతో తీరిందన్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో సినీ పరిశ్రమ మరొక వెలుగు వెలుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. 



రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్, రామ్ చరణ్‌ని (NTR fans, Ram Charan fans about RRR trailer) ఒకే స్క్రీన్‌పై ప్రజెంట్ చేస్తూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేస్తోన్న మరో భారీ ప్రాజెక్టుకు దృశ్య రూపమే ఈ ఆర్ఆర్ఆర్ మూవీ. తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో హిందీ నుంచి అజయ్ దేవ్ గన్ లాంటి సీనియర్ హీరో, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


[[{"fid":"217102","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRR trailer launch live updates","field_file_image_title_text[und][0][value]":"ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లాంచింగ్‌లో రాజమౌళి, ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్, తారక్, డివివి దానయ్య తదితరులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RRR trailer launch live updates","field_file_image_title_text[und][0][value]":"ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లాంచింగ్‌లో రాజమౌళి, ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్, తారక్, డివివి దానయ్య తదితరులు"}},"link_text":false,"attributes":{"alt":"RRR trailer launch live updates","title":"ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లాంచింగ్‌లో రాజమౌళి, ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్, తారక్, డివివి దానయ్య తదితరులు","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read : RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. 2 వేల కోట్లు కాదు 20వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయం


ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్‌కి సోషల్ మీడియాలో (RRR trailer fans reactions) భారీ స్పందన కనిపిస్తోంది. టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమ వరకు టాప్ హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు ఆర్ఆర్ఆర్ మూవీ గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 


Also read : RRR Trailer Response: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు సెలెబ్రిటీలు ఫిదా.. RRR Teamపై ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook