Pawan Kalyans Vakeel Saab Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంగ్ గ్యాప్ తరువాత తెరపై కనిపించనున్న మూవీ వకీల్ సాబ్. దాంతో వకీల్ సాబ్ మూవీ ట్రైలర్‌పై మెగా ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రెండేళ్ల తరువాత విడుదలైన పవన్ మూవీ ట్రైలర్ కావడంతో అంచనాలను మించిన స్పందన లభిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వకీల్ సాబ్ ట్రైలర్ సోమవారం రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్(Vakeel Saab Movie) ట్రైలర్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్యాన్స్ మధ్య తోపులాట జరగడం, థియేటర్లోకి త్వరగా చేరుకోవాలని అత్సుత్సాహం ప్రదర్శించడంతో సినిమా హాల్ అద్దాలు పగిలిపోయాయి. ఫ్యాన్స్ మధ్య తోపులాట జరగడంతో అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కొందరు కింద పడిపోగా, తొక్కుకుంటూ లోపలికి పరిగెత్తడం విశాఖపట్నంలోని ఓ థియేటర్ వద్ద కనిపించింది.


Also Read: Hari Hara Veeramallu first look: హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ వీడియో వైరల్



వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్ అని తెలిసిందే. వకీల్ సాబ్ Pawan Kalyan కి శృతి హాసన్ జంటగా నటించింది. అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ తమకు న్యాయం చేయాలని కోరుతూ వకీల్ సాబ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)‌ను సంప్రదించగా వారి న్యాయపోరాటమే ఈ సినిమా కథాంశంగా చూపించనున్నారు. 



దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. రెండేళ్ల తరువాత రానున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డులు తిరగరాస్తోంది.


Also Read: Sathyameva Jayathe​ Song: పవన్ కళ్యాణ్ Vakeel Saab నుంచి సత్యమేవ జయతే సాంగ్, మీరూ వీక్షించండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook