Vakeel Saab Movie: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ రెడీ

Pink Telugu Remake Vakeel Saab Movie | న్యాయం కోసం పలువురు అమ్మాయిలు సాగించే న్యాయ పోరాటంలో వారికి బాసటగా నిలిచే లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఆయనకి జంటగా శ్రుతి హాసన్ (Shruti Haasan) మరోసారి నటిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 2, 2021, 05:18 PM IST
  • పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
  • ఇదివరకే ఈ మూవీ నుంచి మగువా మగువా లిరికల్ సాంగ్ విడుదలై సక్సెస్
  • మార్చి 3న విడుదలకు సిద్ధంగా ఉన్న వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్
Vakeel Saab Movie: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ రెడీ

Pawan Kalyan Vakeel Saab Movie Latest Update: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఇదివరకే ఈ మూవీ నుంచి మగువా మగువా లిరికల్ సాంగ్ విడుదలై సక్సెస్ సాధించగా.. మరో పాట ‘సత్యమేవ జయతే’ మార్చి 3న విడుదల కానుంది. ఈ సాంగ్‌ను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధంగా ఉంది.

ఇదివరకే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఏప్రిల్ 9వ తేదీన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ(Vakeel Saab Movie) థియేటర్లకు రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ మూవీని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బుధవారం నాడు ‘సత్యమేవ జయతే’ లిరికల్ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: PSPK 27: మొదలైన పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్

వేసవిలో విడుదల కానున్న సినిమాలకు వకీల్ సాబ్ గట్టి పోటీ ఇవ్వనుందని సీని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకే విడుదలైన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో వచ్చిన పింక్ సినిమా తెలుగు (Tollywood) రీమేక్ ఈ వకీల్ సాబ్. హిందీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కనిపించనున్నారు. కెరీర్‌లో తొలిసారి లాయర్ పాత్రలో నటించడంతో మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ నెలకొంది.

Also Read: Pawan Kalyan వకీల్ సాబ్ మూవీ స్టిల్స్ వైరల్

న్యాయం కోసం పలువురు అమ్మాయిలు సాగించే న్యాయ పోరాటంలో వారికి బాసటగా నిలిచే లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఆయనకి జంటగా శ్రుతి హాసన్ (Shruti Haasan) మరోసారి నటిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్మకుడు ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ రూటు మారిందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News