Karthikeya Engagement: 'ఆర్‌ఎక్స్ 100'(RX 100 hero)  హీరో కార్తికేయ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం కార్తికేయ నిశ్చితార్థానికి హాజరై అభినందనలు తెలిపారు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కార్తికేయ(Karthikeya) మనువాడబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read:Salman Khan: టైగర్‌ 3 మూవీ షూటింగ్ ఫిక్స్ లీక్...వైరల్ గా సల్మాన్ ఫోటోలు..


2017లో విడుదలైన ‘'ప్రేమతో మీ కార్తీక్‌'(Prematho mee Karthik)’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కార్తికేయ. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని  అందించలేకపోయింది. అనంతరం వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఆయనకు సూపర్‌హిట్‌ అందించింది. కేవలం హీరో రోల్స్‌ మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగాను ఆయన మెప్పిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌(Gang Leader)’లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్‌(Ajith) హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.  ప్రస్తుతం రాజా విక్రమార్క(Raja Vikramarka) సినిమాలో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా యు.వి.క్రియేషన్స్ లో కూడా ఓ ప్రాజెక్టు ను ఓకే చేసినట్లు సమాచారం.


గత ఏడాది నుండి యంగ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. రానా, నితిన్, నిఖిల్ ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. అంతేకాకుండా కాజల్ అగర్వాల్, నిహారిక కొణిదెల కూడా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవ్వగా.. కొన్ని రోజుల కిందట టాలీవుడ్(Tollywood) హీరోయిన్ మెహరిన్ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook