Chiranjeevi: చిరు 154వ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. సూపర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్‌..

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2021, 02:19 PM IST
  • నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే
  • చిరు- మోహర్ రమేశ్ మూవీ టైటిల్ రిలీజ్
  • మోషన్ పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు
Chiranjeevi: చిరు 154వ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. సూపర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్‌..

Chiranjeevi: నేడు మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 154వ చిత్రానికి సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చేసింది.  మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ లో చిరు నటిస్తున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి 'భోళా శంకర్' అనే టైటిల్ ఖరారు చేశారు. 

ఈ మూవీకి సంబంధించిన టైటిల్ మోషన్  పోస్టర్(Motion Poster) ను  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu) విడుదల చేశారు.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర(Anil Sunkara) నిర్మిస్తున్నారు. తమిళ వేదాళం(Vedalam)లో అజిత్(Ajith) హీరోగా నటించారు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్(Pavan Kalyan) నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు.  ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ రీమేక్ చేయబోతున్నారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌(Keerthi Suresh) నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read: Chiranjeevi Birthday Special: చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi)కు ప్రముఖుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.  ఒకరోజు ముందు నుంచే సినిమా తారలంతా మెగా స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘చిరు తమతో పాటు మరెందరికో స్ఫూర్తి’ అంటూ కొందరు యువ హీరోలు విషెస్‌ తెలియజేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా(Soical Media)లో చిరంజీవికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలోనే చిరు కొత్త సినిమాల అప్‌డేట్‌లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలనే మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘'గాడ్‌ ఫాదర్‌'(God Father)’ సినిమా టైటిల్‌ను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళ పర్‌ హిట్‌ మూవీ 'లూసిఫర్‌'(Lucifer) చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య(Achraya) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌బోతున్నాడు మెగాస్టార్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News