Saddam Yadamma Raju Back To Jabardasth బుల్లితెరపై జరిగే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు జబర్దస్త్, మల్లెమాల నుంచి బయటకు వెళ్తూనే ఉండేవారు. అనసూయ, సుధీర్, గెటప్ శ్రీను, ఆది ఇలా అందరూ బయటకు వెళ్లారు. మధ్యలో శ్రీను, ఆది ఇలా తిరిగి వచ్చారు. అయితే మల్లెమాల నుంచి వెళ్లడమే గానీ.. ఒక్కరు కూడా బయటి నుంచి లోపలకు రావడం లేదు. దీంతో మల్లెమాల టీం లోలోపల గట్టిగానే ప్రయత్నాలు చేపట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు జబర్దస్త్, మల్లెమాలలోకి చాలా మందే వచ్చేట్టు కనిపిస్తోంది,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చమ్మక్ చంద్ర తన గురువు అని, ఆయన బయటకు వెళ్లడంతో తాను కూడా వెళ్లానని ఆ మధ్య జబర్దస్త్ సత్య చెప్పింది. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోలోకి తిరిగి వచ్చింది. ఇక ఆమె దారిలో సద్దాం, యాదమ్మ రాజులు కూడా వచ్చేశారు. సద్దాం, యాదమ్మ రాజులకు లైఫ్ ఇచ్చిందే మల్లెమాల సంస్థ. యాంకర్ రవి, శ్రీముఖి కలిసి చేసిన పటాస్ షోతో సద్దాం, యాదమ్మ రాజులు తెర మీదకు వచ్చారు. ఆ స్టేజ్ మీదే వీరి ప్రయాణం మొదలైంది.


 



పటాస్ షో ముగియడం, నాగబాబు మల్లెమాల నుంచి బయటకు రావడం ఒకే టైంలో జరిగాయి. అయితే ఆ టైంలో జీ తెలుగులో అదిరింది అనే షోను చేశారు. బొమ్మ అదిరింది అంటూ మార్చారు. కాంట్రవర్సీలు ఎక్కువగా అవుతుండటంతో ఆ షోను ఆపేశారు. ఆ తరువాత ఆ టీం అంతా కూడా స్టార్ మాకు వెళ్లింది.అక్కడ కామెడీ స్టార్స్ అంటూ జబర్దస్త్ షోకు పోటీగా నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఏనాడూ కామెడీ స్టార్స్ టీఆర్పీ రేటింగ్‌లో ఐదు పాయింట్లు దాటిన దాఖలాలు లేవు.


ఇక ఇప్పుడు మల్లెమాల కూడా చర్యలు చేపట్టినట్టుంది. అందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టినట్టు కనిపిస్తోంది. అందుకే సద్దాం, యాదమ్మరాజులు మళ్లీ మల్లెమాలకు వచ్చారు. జబర్దస్త్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చారు. ఇది మాతృ సంస్థ, తల్లి లాంటిది కాబట్టి మళ్లీ వెనక్కి వచ్చామంటూ స్కిట్లో భాగంగా డైలాగ్ కొట్టేశాడు సద్దాం. మరి హైపర్ ఆదితో ఉన్న కోల్డ్ వార్ గురించి సద్దాం మున్ముందు ఏదైనా పంచులు వేస్తాడా? లేదా ఆది తిరిగి వచ్చాక సద్దాం మీద కౌంటర్లు వేస్తాడా? అన్నది చూడాలి


Also Read : Varisu Thetre Issue : దళపతి విజయ్ నెం.1 హీరోనట.. అజిత్ అభిమానులను గెలికిన దిల్ రాజు


Also Read : Shilpa Reddy Bikini : బికినిలో సామ్రాట్ అక్క.. అందాల ఆరబోతలో టాప్ లేపేస్తోన్న శిల్పా రెడ్డి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook