Varisu Thetre Issue : దళపతి విజయ్ నెం.1 హీరోనట.. అజిత్ అభిమానులను గెలికిన దిల్ రాజు

Dil Raju Compares Vijay and Ajith దిల్ రాజు పక్కా బిజినెస్ మెన్ అన్న సంగతి తెలిసిందే. తన సినిమా గురించి ఎంతకైనా తెగిస్తాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాను పైకి లేపేందుకు పక్క సినిమాలను పడుకోబెడతాడని అంతా అంటుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 09:17 AM IST
  • సంక్రాంతికి తీవ్ర పోటీ
  • కోలీవుడ్‌ విజయ్ వర్సెస్ అజిత్
  • ఎక్కువ థియేటర్లు కావాలంటోన్న దిల్ రాజు
Varisu Thetre Issue : దళపతి విజయ్ నెం.1 హీరోనట.. అజిత్ అభిమానులను గెలికిన దిల్ రాజు

Varisu Thetre Issue దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు తెలుగులో వారసుడు సినిమాకు థియేటర్ల సమస్య ఎదురవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. కానీ బరిలో చిరు, బాలయ్య సినిమాలున్నాయి. ఓ డబ్బింగ్ సినిమాకు భారీ మొత్తంలో థియేటర్లు ఎలా కేటాయిస్తారంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. కోలీవుడ్‌లో ఇంకోలా ఉన్నాయి. అక్కడ అజిత్ తునివు, విజయ్ వారిసు బరిలోకి దిగుతున్నాయి.

అజిత్ తునివు సినిమాను ఉదయ నిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నాడు. రెడ్ జెయింట్ మీద తునివు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కదా? అని తునివు చిత్రాన్ని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయడం లేదు.. రెండింటికి సరిపడా సమానమైన థియేటర్లు ఇస్తామని ఉదయ నిధి స్టాలిన్ ఎప్పుడో తెలిపాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు మళ్లీ గెలికేందుకు ప్రయత్నిస్తున్నాడు.

సమానంగా థియేటర్లు వద్దు అని, ఇంకా కొన్ని ఎక్కువ థియేటర్లు తమకు కేటాయించమని ఉదయ నిధి స్టాలిన్‌ను దిల్ రాజు అడుక్కుండాట. విజయ్ నెంబర్ వన్ హీరో అని, అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అంటూ ఇలా పిచ్చి పిచ్చిగా వాగేస్తూ పోయాడు దిల్ రాజు. విజయ్ పెద్ద హీరో కాబట్టి ఎక్కువ థియేటర్లు కావాలని అడుగుతాడట. దీంతో మళ్లీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టినట్టు అయింది. తన సినిమా కోసం మిగతా హీరోను తక్కువ చేసి మాట్లాడటంతో నెటిజన్లు మండి పడుతున్నారు.

అసలే తమిళనాట తలా వర్సెస్ దళపతి అన్నట్టుగా ఉంటుంది. ఇక అభిమానుల మధ్య దిల్ రాజు మాటలు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అయింది. ఇప్పుడు దిల్ రాజు మీద తలా ఫ్యాన్స్ ఆగ్రహం మీదున్నారు. విజయ్‌తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు.. అదే అజిత్‌తో సినిమా తీస్తే ఇంకోలా మాట్లాడతాడు.. పక్కా బిజినెస్ మెన్ అని ఆడేసుకుంటున్నారు

Also Read : Shilpa Reddy Bikini : బికినిలో సామ్రాట్ అక్క.. అందాల ఆరబోతలో టాప్ లేపేస్తోన్న శిల్పా రెడ్డి

Also Read : Upasana Pregnancy : వాళ్ల ఆశీస్సుల వల్లే తల్లిని అవుతున్నా.. అత్తమ్మను మిస్ అయ్యా.. ఉపాసన పోస్ట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News