సమంత ప్రస్తుతం తన సినిమా పనులతోనే బిజీగా ఉంటోంది. మధ్యలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. తన మీద ఎన్ని రూమర్లు వచ్చినా సైలెంట్‌గానే ఉంటూ వచ్చింది. విడాకుల అనంతరం తన మీద వచ్చిన పిచ్చి పిచ్చి కథనాలు, రూమర్ల మీద మండిపడింది. కోర్టు మెట్లు కూడా ఎక్కి పోరాడింది. తన మీద తప్పుడు కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"249354","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సమంత వ్యవహారం విడాకుల తరువాత మరింతగా మారింది. సమంత చైతన్య విడిపోయిన తరువాత వచ్చిన కథనాలు, సమంత స్నేహితుల మీద జరిగిన నెగెటివ్ ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. సమంత పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ వల్లే ఈ విడాకులు జరిగాయనే రూమర్లు ఎక్కువగా వచ్చాయి. కానీ తాను సమంతను అక్కా అని పిలుస్తానంటూ ప్రీతమ్ క్లారిటీ ఇచ్చాడు.


[[{"fid":"249355","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇక సమంత తన చుట్టూ ఉన్న స్నేహితుల వల్లే ప్రభావం అయిందని, అందుకు కారణం ఆమె స్టైలిష్ట్ ప్రీతమ్, మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్, చిన్మయి, దర్శకురాలు నందినీ రెడ్డి, డాక్టర్ మంజుల అంటూ ఇలా నానా రకాల పేర్లు వార్తల్లో వైరల్ అయ్యాయి. అయితే సమంత మీద జరిగిన ట్రోలింగ్‌ను సాధన, ప్రీతమ్, చిన్మయి ఇలా అందరూ తిప్పి కొట్టేశారు.


[[{"fid":"249356","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


సమంత తన స్నేహితులతోనే ఎక్కువగా గడిపింది. విడాకుల తరువాత శిల్పారెడ్డితో కలిసి సమంత ఛార్ ధామ్ యాత్రకు వెళ్లింది. ఆ తరువాత దుబాయ్ ట్రిప్‌కు వెళ్లింది. అలా ట్రిప్పులు మీద ట్రిప్పులు వేసింది. సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి షూటింగ్‌లలో చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శాకుంతలం, యశోద సెట్స్‌లో సాధన, ప్రీతమ్, సమంత కలిసి తెగ అల్లరి చేస్తుండేవారు.


[[{"fid":"249357","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


తాజాగా సమంత ఫ్రెండ్ సాధన సింగ్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సమంత పాత ఫోటోలను సాధన షేర్ చేసింది. సమంత బోల్డ్ ఫోటోలను ఇలా సాధన షేర్ చేయడంతో కొంత మంది నెటిజన్లు కాస్త పెదవి విరిచినట్టు కనిపిస్తోంది. దీనిపై సాధనను ప్రశ్నించారు. కానీ సాధన మాత్రం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.


[[{"fid":"249358","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ఇవి పాత ఫోటోలు కదా? ఇప్పుడు ఇవి ఎందుకు షేర్ చేశారు? అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో సాధన సింగ్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. నిన్ను పర్మిషన్ అడిగి పోస్ట్ చేయాలా? నువ్ టైప్ చేసే ముందు కాస్త ఆలోచించుకో అంటూ చురకలు అంటించింది. దీంతో సాధన రిప్లై చూసి అందరూ షాక్ అవుతున్నారు.


Also Read : Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. ట్రోలర్‌లకు మంచు విష్ణు కౌంటర్


Also Read : Prince Movie Review : ప్రిన్స్ రివ్యూ.. లాజిక్‌లకు ఆమడదూరం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook