Sai Chand Villain in Salar: ప్రభాస్ మూవీలో విలన్‌గా ఫిదా, ఉప్పెన ఫేమ్ సాయి చంద్!
Prabhas Salar Movie Villain: ఫిదా, ఉప్పెన, కొండపొలంలాంటి మూవీల్లో తండ్రి పాత్రల్లో డీసెంట్‌గా నటించిన సాయి చంద్ ఇప్పుడు విలన్‌గా మారనున్నారు. అది కూడా ప్రభాస్‌కు అపోజిట్ విలన్‌గా కనిపించనున్నారు.
Fida Movie Fame Actor Sai Chand Villain in Salar: కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ సలార్. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ప్రభాస్ సలార్‌పై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. సలార్‌ను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాలిన మూవీ యూనిట్ భావిస్తుందంటూ టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా సీరియస్ లుక్‌లో కనిపించనున్నారట. శ్రుతిహాసన్ ఈ మూవీలో ఆద్యగా నటిస్తోంది.
కాగా సలార్ సినిమాలో విలన్‌గా జగపతి బాబు నటిస్తున్నారు. సలార్ మూవీలో జగపతి బాబు లుక్‌ను ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ పోస్ట్ ఫుల్ వైరల్ అయింది. మంచి సాలిడ్ క్యారెక్టర్‌లో జగపతిబాబు కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సలార్ మూవీలో జగపతి బాబు పాత్రకు సంబంధించినటువంటి షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.
అయితే ప్రభాస్‌కు అపోజిట్‌గా విలన్‌గా నటించేందుకు నటుడు సాయి చంద్‌ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించారని టాక్. ఫిదా, సైరా, ఉప్పెన, కొండపొలం సినిమాల్లో నటించిన సాయి చంద్‌ను సలార్ మూవీలో చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపించాలనుకుంటున్నారట ప్రశాంత్ నీల్. అయితే ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాయి చంద్ ఇప్పటి వరకు తండ్రి పాత్రల్లో చాలా డీసెంట్ క్యారెక్టర్స్ పోషించాడు. అలాంటి సాఫ్ట్ పర్సనాలిటీ వ్యక్తిని.. విలన్‌గా ఎంపిక చేసుకోవడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. మరి సాయి చంద్ సలార్‌లో విలన్‌గా కనిపిస్తారా.. ఆయనను ప్రశాంత్ నీల్ తెరపై ఎలా చూపిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Meenakshi Chaudhary Photos: ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Also Read: Taapsee Pannu Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ తాప్సీ ముద్దుగుమ్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook