Sai Dharam Controversy: సినీ నటుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాడు తేజ్. అయితే అక్కడ అర్చకులు లేకపోవడంతో సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇవ్వడం వివాదానికి దారి తీసింది. పూజారులు తప్ప ఎవరు హారతి ఇవ్వకూడదని భక్తులు మండిపడుతున్నారు. అసలు అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ హరతి ఇచ్చిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆలయ అధికారులు, సాయిధరమ్ తేజ్‌పై భక్తులు ఫైర్ అవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలె విరూపాక్ష మూవీతో సాయి ధరమ్ తేజ్ సూపర్ హిట్ అందుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో సినిమాలో నటిస్తున్నాడు. 


రోడ్డు ప్రమాదం తరువాత పెద్దగా బయటకు రాని సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం ప్రత్యేకంగా ఆలయాలను సందర్శిస్తున్నారు. కాణిపాకం వినాయక స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయి ధరమ్‌ తేజ్‌ను చూసేందుకు అభిమానులు భారీ తరలివచ్చారు. 


తనకు ఇది పునర్జన్మ అని.. దేవుడు పునర్జన్మ ప్రసాదించారని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. అందుకే తాను ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలిపాడు. బ్రో సినిమాలో మామయ్యతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి అని చెప్పాడు. ఆయనతో కలిసి యాక్ట్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పవన్, సాయి ధరమ్ తేజ్ లుక్స్, టీజర్ రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. శనివారం ఈ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదల కాబోతుంది. ఈ సినిమాను జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: Tax Refund Status: ఐటీఆర్ ఫైల్ చేశారా..? రీఫండ్ స్టాటస్‌ను ఇలా చెక్ చేసుకోండి  


Also Read: SBI MCLR Price: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. వడ్డీ రేట్లు పెంపు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి