SBI MCLR Price: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. వడ్డీ రేట్లు పెంపు

SBI Hikes MCLR Price: ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. పెంచిన రేట్లు జూలై 15వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎస్‌బీఐ నిర్ణయంతో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లపై లోన్లు తీసుకున్న వారి ఈఎంఐలు పెరగనున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 15, 2023, 09:09 AM IST
SBI MCLR Price: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. వడ్డీ రేట్లు పెంపు

SBI Hikes MCLR Price: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని అన్ని పదవీకాలాల్లో 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో లోన్ తీసుకున్న వారి ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. పెంచిన రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయిన లోన్ల ఈఎంఐలు ఇక నుంచి మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్‌తో లోన్లు తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.

తాజాగా సవరించిన రేట్లతో ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి 8.55 శాతానికి పెరిగింది. ఎస్‌బీఐలో చాలా రుణాలు ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్‌ రేటుతో లింక్ అయి ఉన్నాయి. ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ వరుసగా  8 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.45 శాతానికి పెరిగింది. 2 సంవత్సరాల రేటు 8.65 శాతం, 3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్‌ 8.75 శాతానికి పెంచినట్లు ఎస్‌బీఐ తెలిపింది. 

ఈ ఏడాడి మార్చి నెలలో ఎంసీఎల్ఆర్ 70 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ రేపోరేటను 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నా.. ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచడం గమనార్హం. బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచినప్పుడల్లా.. హోమ్‌ లోన్స్ ఈఎంఐ, వెహికల్ లోన్ వంటి వాటికి సంబంధించిన రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.

ఎంసీఎల్ఆర్ అంటే..?

లోన్ కోసం బ్యాంకులు విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా నిర్ణయిస్తారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో ఎంసీఎల్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. ఎంసీఎల్ఆర్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపిస్తుంది. ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయించేటప్పుడు డిపాజిట్ రేట్లు, రెపో రేట్లు, ఆపరేషనల్ ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తరువాతే ఎంసీఎల్ఆర్‌ రేటును పెంచుతారు. ఎంసీఎల్ఆర్ అమలుకు ముందు లోన్లకు కనీస వడ్డీ రేటుగా బేస్ రేటుగా ఆర్‌బీఐ పరిగణించేది. ఇది ఫంక్షనాలిటీ పరంగా ఎంసీఎల్ఆర్ రేటు మాదిరే అదే ప్రయోజనాన్ని అందిస్తుంది. 

Also Read: Yashasvi Jaiswal: వెస్టిండీస్‌ బౌలర్‌‌ను బూతులు తిట్టిన యశస్వి జైస్వాల్.. వీడియో వైరల్  

Also Read: Twitter Ads Revenue: ట్విట్టర్‌ కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. మాట నిలబెట్టుకున్న ఎలన్ మస్క్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News