Sai Dharam Tej get ready to engaged: టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి త్వరలోనే కానుంది. ఇటీవలనే ప్రముఖ హీరోలు నిఖిల్, నితిన్, రాణా మ్యారెజ్‌లు అంగరంగవైభవంగా జరిగాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) తమ్ముడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎంగేజ్‌మెంట్ కూడా వారం క్రితమే జరిగింది. అయితే సోలో బతుకే సో బెటర్ అన్న మెగాస్టార్ మేనల్లుడు, మెగా సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ( Sai Dharam Tej ) కూడా త్వ‌ర‌లోనే పెళ్లి  పీట‌లు ఎక్క‌బోతున్న‌ాడు. ఆయన ఆదివారం సోషల్ మీడియా వెబ్‌సైట్లు ట్విట్టర్, ఫెస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సెషనల్‌గా మారింది. ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం.. కానీ ఆ టైం వచ్చినప్పుడు త‌ప్ప‌దు మ‌రి అని వీడియోను షేర్ చేస్తూ రాశాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో బ్యాచిల‌ర్ హీరోలంతా ఉన్న సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా ఇలా ఒక్కొక్క‌రు లెఫ్ట్ అవుతారు. అయితే.. ఇప్పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఇట్స్ మై షో టైమ్.. సారీ ప్రభాస్ ( Prabhas ) అన్న.. అంటూ లెఫ్ట్ అవుతాడు. దీంతో త్వ‌ర‌లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అయితే.. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ తెలియాలంటే.. రేపు ఉద‌యం 10గంటల వ‌ర‌కు ఆగాల్సిందే. Also read: Acharya దర్శకుడి సంస్కారానికి నమస్కారం: హరీష్ శంకర్


ఇదిలా ఉంటే మెగా సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ సుబ్బు దర్శకత్వంలో “సోలో బతుకే సో బెటర్” అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఆయన సరసన నభా నటేష్ నటిస్తోంది. అయితే సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. Also read: Vijay Deverakonda: రూ.100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ ?