Vijay Deverakonda: రూ.100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ ?

విజ‌య్ దేవ‌రకొండ అభిమానులకు ( Vijay Deverakonda fans ) గుడ్ న్యూస్. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో ప్రస్తుతం ఫైటర్ మూవీ ( Fighter movie ) చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వి మూవీ దర్శకుడు ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Aug 23, 2020, 05:30 AM IST
Vijay Deverakonda: రూ.100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ ?

విజ‌య్ దేవ‌రకొండ అభిమానులకు ( Vijay Deverakonda fans ) గుడ్ న్యూస్. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో ప్రస్తుతం ఫైటర్ మూవీ ( Fighter movie ) చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వి మూవీ ( V movie ) దర్శకుడు ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే.. వీళ్లిద్దరి కాంబోలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను సుమారు 100 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ ( Dil Raju ) ఈ సినిమాను నిర్మించనున్న‌ట్టు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. Also read : Sonu Sood: సోనూ సూద్ వార్నింగ్

విజ‌య్ దేవ‌రకొండ, ఇంద్ర‌గంటి మోహనకృష్ణ కాంబినేష‌న్‌లో సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాకపోవడం గమనార్హం. ఒకవైపు తమ హీరో సినిమా భారీ బడ్జెట్‌తో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందనుందనే టాక్ అభిమానులకు ఆనందాన్నే ఇస్తున్నప్పటికీ.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోవడమే కొంత అయోమయానికి గురిచేస్తోందంటున్నారు రౌడి ఫ్యాన్స్ ( Rowdy fans club ). Also read : Jr NTR remuneration: ఎన్టీఆర్ పారితోషికం తిరిగిచ్చేశారా ?

Trending News