Sai Dharam Tej New Movie Virupaksha Title Glimpse Out: గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన మెగా సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్.. 16 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకుడు కార్తిక్‌ దండుతో ఓ మిస్టరీ థ్రిల్లర్‌ చేస్తున్నాడు. SDT 15 అనే వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెక్కల మాస్టర్ సుకుమార్‌ కథ అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాయిధరమ్‌ తేజ్ కొత్త సినిమాకు 'విరుపాక్ష' అనే టైటిల్‌ను తాజాగా ఖరారు చేశారు. బీమ్లా నాయక్ ఫెమ్ సంయుక్త మీనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విరుపాక్ష నుంచి రిలీజైన ప్రీలుక్‌ పోస్టర్‌లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ వాయిస్‌ అందించారు. ఎన్టీఆర్‌ వాయిస్‌తో రిలీజ్‌ అయిన ఈ టీజర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 



53 సెకండ్ల నిడివి గల విరుపాక్ష టీజర్‌ 'అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం' అనే డైలాగ్ తో ఆరంభం అయింది. ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. సినిమా టైటిట్‌తో పాటు, రిలీజ్ డేట్‌ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న విరుపాక్ష సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. 


Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు గాయం.. ఆసుపత్రికి తరలింపు  


Also Read: Team India: బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌పై వేటుకు సిద్ధం..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.