Sai Dharam Tej Renamed: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కీలక ప్రకటన చేశాడు. తన పేరును మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. తల్లి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ పేరును మార్చేసుకున్నాడు. ఇకపై సాయి ధరమ్‌ తేజ్‌ కాస్తా కొత్త పేరుతో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తేజ్‌ బహిరంగ ప్రకటన చేశాడు. తన పేరులో తన తల్లి పేరు ఉండేలా మార్చుకున్నట్లు తెలిపాడు. ఓ సినీ వేడుకలో ఈ ప్రకటన చేశాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sharwanand Baby Girl: బర్త్‌ డే నాడే హీరో శర్వానంద్‌కు డబుల్‌ ప్రమోషన్‌.. 'అద్భుతం' పక్కన చేరింది


గతంలో తేజ్‌, స్వాతి కలిసి చేసిన 'సత్య' అనే షార్ట్‌ ఫిల్మ్‌ను మరోసారి ప్రసారం చేశారు. ప్రీమియర్‌ వేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్‌ 'మీ జీవితంలో మహిళల పాత్ర' గురించి ప్రశ్న అడగ్గా తేజ్‌ సమాధానం ఇలా ఇచ్చాడు. 'నా జీవితంలో ముగ్గురు సత్యలు ఉన్నారు. మా అమ్మ, పిన్ని, అమ్మమ్మ అంజనాదేవి. వాళ్లు నన్ను దగ్గరకు తీసుకుని పెంచారు. వాళ్లను నేను సంతోషంగా ఉంచడం తప్ప ఇంకేమీ చేయలేను. నేను గొప్పగా ఉంటే వాళ్లకే సంతోషం' అని తెలిపాడు.

Also Read: Nivetha Pethuraj: లేలేత అందాలతో 'పాగల్‌'గాన్ని చేస్తూ 'ధమ్కీ' ఇస్తున్న హీరోయిన్‌


'ఎప్పటి నుంచో అమ్మ పేరు మీద ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభిద్దాం అనుకుంటున్నా. కానీ సత్యతో సాధ్యమైంది. మా అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ మొదలుపెట్టా. ఇవాళ్టి నుంచి నా పేరులో మా అమ్మ పేరును కూడా చేర్చాను. నాన్న ఇంటి పేరు ఎలాగూ ఉంటుంది. మా అమ్మ నాతోటి ఉండాలి. అందుకే మా అమ్మ పేరు చేర్చుకుని నా పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నా' అని తేజ్‌ ప్రకటించాడు. త్వరలోనే తన సోషల్ మీడియాలోనూ కూడా తేజ్ మార్చుకున్న పేరును అప్డేట్ చేయనున్నట్లు సమాచారం.


మెగాస్టార్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ వరుస సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న సమయంలో 2021లో బైక్‌ ప్రమాదానికి గురయ్యాడు. చావు బతుకుల నుంచి బయటపడి ఇప్పుడు కోలుకున్నాడు. కోలుకున్న అనంతరం 'విరూపాక్ష' సినిమాతో హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో తేజ్‌ బిజీగా ఉన్నాడు. ప్రమాదం అనంతరం తేజ్‌ ఉత్సాహంగా కనిపించడం లేదు. ఇంకా శారీరకంగా, మానసికంగా కోలుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అభిమానులు మాత్రం తేజ్‌ నుంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి