Sai Dharam Tej : వివాదం మీద స్పందించిన మెగా హీరో.. సాయం చేసిన వ్యక్తిపై సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej Responds On Helping Abdul సాయి ధరమ్ తేజ్ తాజాగా తన మీద జరుగుతున్న ట్రోలింగ్, వస్తోన్న నెగెటివ్ కామెంట్ల మీద స్పందించాడు. తమ టీం ఎప్పుడూ కూడా అతనికి అందుబాటులో ఉంటుందని, ఈ విషయం మీద మరోసారి స్పందించలేని అని అన్నాడు.
Sai Dharam Tej Bike Accident సాయి ధరమ్ తేజ్‌కు బైక్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఓ కుర్రాడు వెంటనే స్పందించిన అంబులెన్స్‌ను పిలిచి ప్రాణాలు కాపాడాడు. ఆ వ్యక్తే అబ్దుల్ ఫర్హాన్. అయితే ఆ వ్యక్తికి ప్రమాదానికి గురైంది సాయి ధరమ్ తేజ్ అని తెలియదు. తెలియకుండానే మానవత్వంతో వెంటనే స్పందించి సాయి ధరమ్ తేజ్‌ను కాపాడాడు. అయితే ఆ సమయంలో అబ్దుల్ ఎక్కువగా ట్రెండ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడు.
విరూపాక్ష ప్రమోషన్స్‌లో సాయి ధరమ్ తేజ్ తనకు సాయం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాడు. తనతో మాట్లాడానని, తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని, అయితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. ఈ మాటల మీద అబ్దుల్ స్పందించాడు. తనతో ఎవ్వరూ మాట్లాడలేదని, మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ ఫోన్ చేయలేదని అన్నాడు. తనకు వాళ్లంతా డబ్బులు ఇచ్చారని బయట అనుకుంటున్నారని, దీంతో పనికి కూడా వెళ్లలేక పోతోన్నాను అని, నాలుగు నెలలుగా ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్నానని అబ్దుల్ అన్నాడు.
అయితే తేజు అబద్దం చెప్పాడా? అంటూ సోషల్ మీడియాలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై తేజు స్పందించాడు. నా గురించి, నా టీం గురించి బయట తప్పుగా ప్రచారం జరుగుతోందనే వార్తలు నా వద్దకు వచ్చాయి.. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా.. ఫర్హాన్‌కు మేం సాయం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు.. ఆయన చేసిన సాయానికి నేను, నా ఫ్యామిలీ ఎప్పుడూ రుణపడి ఉంటాం..
Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్
ఆయన వద్ద మా డీటైల్స్, మా కాంటాక్ట్ డీటైల్స్ ఉన్నాయి.. ఆయనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వొచ్చు.. మా మేనేజర్ శరణ్ ఆయనతో ఎప్పటికీ టచ్‌లోనే, అందుబాటులోనే ఉంటాడు.. ఈ విషయం మీద నేను స్పందించడం ఇదే చివరి సారి అవుతుంది అంటూ సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.
Also Read: Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook