Virupaksha : విరూపాక్ష లెక్కలు ఇవే.. గత చిత్రాల పరిస్థితి ఏంటంటే?
Virupaksha Business Report సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీగా ఉన్నాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Virupaksha Box Office Target సాయి ధరమ్ తేజ్ కాస్త గ్యాప్‌తో వస్తున్నాడు. బైక్ ప్రమాదం జరగడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే రిపబ్లిక్ సినిమా థియేటర్లోకి వచ్చింది. ఆ సినిమా ఓ మోస్తరుగా మెప్పించింది. అయితే థియేటర్లో మాత్రం కలెక్షన్ల వర్షాన్ని కురిపించినట్టు అనిపించలేదు. అంతకు ముందు వచ్చిన సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యాయి.
చిత్రలహరి, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు కమర్షియల్‌గా హిట్ అయ్యాయి. ప్రతి రోజూ పండుగే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. భారీ ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇంత వరకు తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా విరూపాక్ష నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపుగా ఇరవై కోట్లకు పైగా ఉంది. ఈ రేంజ్‌లో ఇంత వరకు బిజినెస్ జరిగింది లేదు. దీంతో ఇప్పుడు తేజ్ ముందు పెద్ద టార్గెట్ వచ్చినట్టు అయింది.
ఇక ఇది వరకు తేజ్ ఓపెనింగ్స్ విషయంలోనూ వండర్లేమీ క్రియేట్ చేయలేదు. చిత్రలహరి, ప్రతి రోజు పండుగ సినిమాలు మాత్రమే మూడు కోట్లకు పైగా షేర్ సాధించాయి. మిగిలిన సినిమాలన్నీ రెండు కోట్ల లోపే ఉన్నాయి. మరి విరూపాక్ష సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అసలే పెద్ద టార్గెట్‌తో తేజ్ వస్తున్నాడు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది? సుకుమార్ శిష్యులు వంద కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. కార్తిక్ దండు కూడా వంద కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్నది చూడాలి.
Also Read: Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్
విరూపాక్ష విషయానికి వస్తే.. థియేటర్ మీద 24 కోట్ల మేరకు, నాన్ థియేటర్ మీద 26 కోట్లకు వసూలు చేసుకుని, టేబుల్ ప్రాఫిట్ లో వుందని సమాచారం అందుతోంది. ఈ మూవీని తెరకెక్కించడానికి దాదాపు నలభై రెండు నుంచి నలభై నాలుగు కోట్ల వరకు ఖర్చయిందని సోషల్ మీడియాలో లెక్కలు కనిపిస్తున్నాయి. మరి ఈ మొత్తానికి థియేటర్లో తేజ్ రాబడతాడా? లేదా? అన్నది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook