Sai Pallavi: సాయి పల్లవి డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పిన విరాటపర్వం డైరెక్టర్...
Sai Pallavi Dedication: సాయి పల్లవి డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుందో దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్ర కోసం ఆమె తనను తాను మలుచుకున్న తీరును వివరించారు.
Sai Pallavi Dedication: సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి. స్క్రీన్‌పై సాయి పల్లవి ఉందంటే ప్రేక్షకులంతా ఆమె లోకంలోనే విహరిస్తుంటారు. సాయి పల్లవితో సినిమా అంటే ఎక్కడ డామినేట్ చేస్తుందేమోనని హీరోలు సైతం భయపడే రేంజ్ ఆమెది. తెరపై ఆమె పెర్ఫామెన్స్ అంతలా మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల.
సాయి పల్లవి ఒక అసాధారణ నటి అని వేణు ఊడుగుల కొనియాడారు. విరాటపర్వంలో వెన్నెల పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి అందులో ఒదిగిపోయిందని చెప్పారు. వెన్నెల పాత్రకు సాయి పల్లవి ఆహార్యం, నటన బాగా కుదిరిందని తెలిపారు. అంతేకాదు, పాత్రకు తగ్గట్లుగా కనిపించేందుకు గాను షూటింగ్ సందర్భంగా ఒకరోజు ఆమె ఆహారం కూడా తీసుకోలేదని చెప్పారు. సాయి పల్లవి అంత అంకితభావం ఉన్న నటి అని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో రానా పాత్ర గురించి మాట్లాడుతూ... రవన్న లాంటి పవర్‌ఫుల్ పాత్రకు రానా మాత్రమే న్యాయం చేయగలడనే ఉద్దేశంతో ఈ పాత్ర కోసం మొదట ఆయన్నే కలిశానని వేణు ఊడుగుల తెలిపారు. తాను అనుకున్న దాని కన్నా రానా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చారు. 1990వ దశకంలో సాగే ఒక ప్రేమ కథ, రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చెప్పారు. సినిమాను తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు.
జూలై 1న విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా గతేడాది ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడక తప్పలేదు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Aadhaar Update: 'ఆధార్'కు సంబంధించి ఆ ప్రకటనను ఉపసంహరించుకున్న కేంద్రం...
Also Read: Nagababu Tour: ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన..త్వరలో నాగబాబు ఉత్తరాంధ్ర టూర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook