Aadhaar Latest Update: యూఐడీఏఐ లైసెన్స్ లేని ఏ ప్రైవేట్ సంస్థకు ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వొద్దని... ఒకవేళ ఇస్తే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందంటూ రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందునా... తక్షణమే దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్ కాపీలను ఇతరులతో పంచుకునేటప్పుడు సాధారణ విచక్షణతో వ్యవహరించాలని సూచించింది. ఆధార్ కార్డ్ హోల్డర్ గుర్తింపు, ప్రైవసీకి తగిన భద్రత కల్పించే ఫీచర్స్ ఆధార్ ఐడింటిటీ అథెంటికేషన్ ఎకోసిస్టమ్ కలిగి ఉందని పేర్కొంది.
ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీల వినియోగానికి సంబంధించి యూఐడీఏఐ బెంగళూరు రీజినల్ ఆఫీస్ నుంచి రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదలైంది. ఆధార్ కార్డు హోల్డర్స్ ప్రైవేట్ సంస్థలకు తమ ఆధార్ కార్డును ఇవ్వడం ద్వారా అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుందని అందులో పేర్కొన్నారు. కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని ఇతరులతో పంచుకోవాల్సి వస్తే 'మాస్క్డ్ ఆధార్ కాపీ'లను ఇవ్వాలని సూచించారు. ఈ మాస్క్డ్ ఆధార్ కాపీల్లో కేవలం ఆధార్ చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయని... దీన్ని యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.
యూఐడీఏఐ నుంచి వచ్చిన ఈ ప్రకటన కాస్త గందరగోళానికి తెరదీసింది. చాలావరకు ప్రైవేట్ సంస్థలు తమ సర్వీసులకు ఆధార్‌ను తప్పనిసరి లేదా ఆమోదించబడిన గుర్తింపు కార్డుగా స్వీకరిస్తున్నాయని... అలాంటప్పుడు కేంద్రం ఈ ప్రకటన చేయడమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసింది.
#Aadhaar holders are advised to exercise normal prudence in using and sharing their Aadhaar numbers.
In view of possibility of misinterpretation the press release issued earlier stands withdrawn with immediate effect.https://t.co/ChmbVs8EjJ@GoI_MeitY @PIB_India— Aadhaar (@UIDAI) May 29, 2022
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... యువతిపై నలుగురి అత్యాచారయత్నం.. చేయించింది మహిళే...
Also Read: GT vs RR Dream11 Team: ఐపీఎల్ 2022 ఫైనల్ పోరులో గుజరాత్, రాజస్తాన్ ఢీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook