#BoycottVirataParvam: సాయి పల్లవి వ్యాఖ్యలతో చిక్కుల్లో విరాటపర్వం.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం..
Sai Pallavi comments rised `Boycott Virata Parvam` in Twitter: హీరోయిన్ సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీశాయి. సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు ట్విట్టర్‌లో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
Sai Pallavi comments rised 'Boycott Virata Parvam' in Twitter: విరాటపర్వం' విడుదల వేళ ఆ సినిమాకు అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి 'కశ్మీర్ పండిట్ల'పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సాయి పల్లవి వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, ఆమె నటించిన 'విరాటపర్వం' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్‌లో పిలుపునిస్తున్నారు. ఈ మేరకు #BoycottVirataparvam అనే హాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవికి మీరు లెఫ్టా.. రైటా.. అని యాంకర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. అంటే.. మీది లెఫ్టిస్ట్ భావజాలమా.. లేక రైటిస్ట్ భావజాలమా అని యాంకర్ సాయి పల్లవిని అడిగారు. అందుకు సాయి పల్లవి తాను న్యూట్రల్ అని సమాధానం చెప్పారు. తానొక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. కాబట్టి తాను న్యూట్రల్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీ తననొక మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటుందని.. అణచివేతకు గురయ్యేవారిని రక్షించాలని చెప్పే మనస్తత్వమని చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావించారు సాయి పల్లవి. అప్పట్లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యలను ఆ సినిమాలో చూపించారని పేర్కొన్నారు. ఇక ఇటీవల గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిపై కొంతమంది దాడికి పాల్పడ్డారని.. ఆ సమయంలో జైశ్రీరామ్ అంటూ నినదించారని అన్నారు. మతం పేరుతో జరిగే ఏ దాడులు సరికావని.. ఈ విషయంలో అప్పటి కశ్మీరీ పండిట్ల హత్యలకు, గోవులను తరలిస్తున్నారనే పేరుతో జరుగుతున్న దాడులకు తేడా లేదన్నారు. లెఫ్ట్, రైట్ వింగ్‌లో ఎవరు కరెక్ట్ అనేది చెప్పలేమని.. మంచి వ్యక్తిత్వం లేకపోతే ఆ రెండింటిలో ఎటు పక్క ఉన్నా న్యాయం ఉండదని అన్నారు.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలే కొందరు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కశ్మీర్‌లో జరిగిన మారణహోమాన్ని, అక్రమంగా గోవులను తరలిస్తున్నవారిపై జరుగుతున్న దాడులను ఎలా పోలుస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రేపు (జూన్ 17) విడుదల కాబోతున్న సాయి పల్లవి విరాటపర్వం సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సాయి పల్లవి వ్యాఖ్యలను సమర్థిస్తుండటం గమనార్హం.
Also Read: India vs South Africa: రేపే నాలుగో టీ20 మ్యాచ్..టీమిండియాకు భారీ షాక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook