India vs South Africa: రేపే నాలుగో టీ20 మ్యాచ్‌..టీమిండియాకు భారీ షాక్..!

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో సఫారీ జట్టు విజయం సాధించగా..టీమిండియా ఓ మ్యాచ్‌లో గెలిచింది. రేపు రాజ్‌కోట్‌లో నాలుగో టీ20 మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం కానుంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 16, 2022, 11:03 AM IST
  • రసవత్తరంగా టీ20 సిరీస్‌
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఉన్న ఇరు జట్లు
  • ఈక్రమంలో టీమిండియాకు భారీ షాక్
India vs South Africa: రేపే నాలుగో టీ20 మ్యాచ్‌..టీమిండియాకు భారీ షాక్..!

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో సఫారీ జట్టు విజయం సాధించగా..టీమిండియా ఓ మ్యాచ్‌లో గెలిచింది. రేపు రాజ్‌కోట్‌లో నాలుగో టీ20 మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని భారత్ భావిస్తోంది. నాలుగో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా స్కెచ్‌లు వేస్తోంది.

ఈక్రమంలో టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. భారత జట్టు యువ పేసర్ ఆవేష్‌ ఖాన్‌ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్‌కోట్ వేదికగా రేపు జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. వైజాగ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆవేష్‌ ఖాన్‌కు గాయమైంది. అతడి కుడి చేతికి దెబ్బతగిలింది. బౌలింగ్ వేయగానే బ్యాటర్ ఆడిన భారీ షాట్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే చేతికి బంతి తగిలింది. దీంతో అతడి చేతికి గాయమైంది.

ఆ ఓవర్ అయిపోయిన తర్వాత ఆవేష్‌ ఖాన్‌ మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడాడు. గాయ నుంచి కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆవేష్‌ ఖాన్‌ స్థానంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చేఅవకాశం కనిపిస్తోంది. రేపు రాజ్‌కోట్ వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..మరింత విస్తరిస్తున్న నైరుతి రాగం..!

Also read:Corona Updates in India: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా వైరస్..తాజాగా కేసులు ఎన్నంటే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News