Saidharam Tej Health Status: సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, నిలకడగా ఆరోగ్యం
Saidharam Tej Health Status: మెగాస్టార్ మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇవాళ చేసిన కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్టు అపోలో వైద్యులు ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది.
Saidharam Tej Health Status: మెగాస్టార్ మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇవాళ చేసిన కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్టు అపోలో వైద్యులు ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం(Saidharam tej health status) నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇవాళ జరిగిన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా విజయవంతమైనట్టు వైద్యులు ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌కు చికిత్స అందిస్తున్నారు. కాలర్ బోన్ సర్జరీలో(Collorbone surgery) పలు విభాగాలకు చెందిన వైద్యుల బృందం పాల్గొందని వివరించారు. క్రమంగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్టుగా తెలుస్తోంది. వైద్యుల బృందం నిరంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నెల 10 వతేదీన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా షోరూమ్ వైపుకు స్పోర్ట్స్ బైక్‌పై వస్తుండగా సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి(Saidharam tej accident) గురయ్యాడు. ముందుగా మెడికవర్ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం..ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో పూర్తి స్థాయి చికిత్స అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook