Saif Ali Khan Joins NTR 30 బాలీవుడ్‌ నుంచి స్టార్ హీరోలను మన తెలుగులో విలన్లుగా నటింపజేస్తోన్న సంగతి తెలిసిందే. మన సౌత్ డైరెక్టర్లు ఎక్కువగా అక్కడి నుంచే విలన్లను తీసుకొస్తున్నారు. సంజయ్ దత్ ఇది వరకే విలన్‌గా మెప్పించాడు. ఇప్పుడు సైఫ్ ఆలీ ఖాన్‌ను కొరటాల శివ రంగంలోకి దించాడు. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం సైఫ్‌ను దించాడు. తాజాగా ఆయన సెట్‌లోకి అడుగు పెట్టేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే కొరటాల శివ ఈ సినిమా కోసం గత ఏడాది నుంచి భారీగా కష్టపడుతున్నాడు. కథ సెట్ అవ్వాలని, స్క్రిప్ట్ అద్భుతంగా రావాలని, అంత వరకు వెయిట్ చేద్దామని ఎన్టీఆర్ సైతం ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చాడట. సినిమా బిజినెస్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకని, సినిమా కథ మీదే ఫోకస్ పెట్టమని, ఆచార్య ఫెయిల్యూర్ గురించి ఎక్కువగా ఆలోచించకని కూడా ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట.


 



ఇక ఈ సినిమాను ప్రారంభించడంలో ఆలస్యం జరిగింది. తారకరత్న మరణంతో మరింతగా ఆలస్యం అయింది. అయితే మొత్తానికి గత నెలలో ఈ మూవీని గ్రాండ్‌గా ప్రారంభించారు. అందరూ అనుకున్నట్టుగానే, రూమర్లు వచ్చినట్టుగానే ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్‌ను కొరటాల శివ సెట్ చేశాడు. విలన్‌ విషయంలో ఇన్ని రోజులు ఎన్నో రూమర్లు వచ్చాయి. చివరకు అవే నిజం అయ్యాయి. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్‌ను రంగంలోకి దించారు.


Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్


నేడు ఈ మూవీ షూటింగ్‌లో సైఫ్, ఎన్టీఆర్ తలపడబోతోన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ షెడ్యూల్‌లో జాన్వీ కపూర్‌ సీన్లు ఉంటాయా? లేదా? అన్నది తెలియడం లేదు. అయితే జాన్వీ సైతం ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే ఉందన్న విషయం తెలుస్తోంది. ఈ షెడ్యూల్ జాన్వీ, ఎన్టీఆర్ మీద సీన్లు కూడా షూట్ చేయబోతోన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే.


Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook