Salar Teaser: సలార్.. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ అన్ని సినిమా ఇండస్ట్రీ జనాలు ఎదురుస్తున్న సినిమా 'సలార్'. KGF పార్ట్ 1 & 2 డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్ర యూనిట్ ఈ వారం మొదట్లో సలార్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసందే. టీజర్ కు వచ్చిన అద్భుతమైన స్పందనకుగాను చిత్ర నిర్మాణ సంస్థ  హోంబలే ఫిల్మ్స్ కృతఙ్ఞతలు తెలుపుతూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో నోట్ విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత సినీ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన టీజర్‌గా 'సలార్' టీజర్‌ను రికార్డ్ కెక్కించిన అభిమానులకు మేకర్స్ కృతజ్ఞతలు తెలుపుతూ నోట్ విడుదల చేశారు. వీటితో పాటుగా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా విడుదల చేయటంతో అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. 


ప్రభాస్ నటించిన సలార్ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఇందులో మొదటి భాగం 'సలార్ సీజ్ ఫైర్' గా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ట్రైలర్ మాత్రం ఆగస్టు చివరి వారంలో రానుంది. "ఆగస్టు చివరి వారాన్ని మీ కాలెండర్ లో బ్లాక్ చేసుకోండి.. భారత సినిమా ఖ్యాతిని పెంచే ఆసక్తికరమైన ట్రైలర్ విడుదల చేయనున్నాము. మరపురాని అనుభవం ఎదురుచూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. 


Also Read: Nayakudu Trailer Review: మహేష్ బాబు, రాజమౌళి చేతుల మీదుగా నాయకుడు ట్రైలర్ లాంచ్



ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా అటు ఇండస్ట్రీ జనాలతో పాటు అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ టీజర్ విడుదల అయిన కొద్దీ సమయానికే 100 మిలియన్ల వీక్షణలను దాటడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సలార్ సినిమాలో పృథ్వీరాల్ సుకుమారన్, టిను ఆనంద్ మరియు శృతి హాసన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సలార్ సినిమా టీజర్ పోస్ట్ చేసిన కొద్దీ క్షణాలకే ట్విట్టట్ లో ట్రెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. టీజర్ రిలీజ్ కి రిప్లైగా చాలా మంది అభిమానులు కామెంట్స్ చేశారు. ఆత్రంగా ఎదురుచూస్తున్నాం అని ఒకరు ట్వీట్ చేస్తే.. ఇది ప్రభాస్ కెపాసిటీ అని మరొకరు కామెంట్ చేశారు. 


KGF సిరీస్ ఘనవిజయం తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం సలార్. బాహుబలి సీరీస్ తరువాత ప్రభాస్ కి హిట్ లేకపోవటం.. దేశ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై పెద్ద ఎంతున్నా అంచనాలు నెలకొన్నాయి. KGF సినిమా.. ఇపుడూ రాబోతున్న సలార్ సినిమా మరియు ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న ఈ 3 సినిమాలకి లింక్ ఉండొచ్చని కొంత మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 


Also Read: JAILER: సూపర్ స్టార్ స్టైల్.. తమన్నా డ్యాన్స్... అదిరిపోయిన 'జైలర్' ఫస్ట్ సాంగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి