Salman Khan: థియేటర్లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్.. టైగర్-3 మూవీ షోలో రచ్చరచ్చ
Tiger 3: బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తువులు అంటే అదే ఒక పండుగగా చేసుకుంటారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆయన టైగర్ 3 సినిమా ఏకంగా పండుగ రోజు విడుదల కావడం మరో విశేషం. ఈ సినిమా నిన్న దీపావళి పండుగ రోజు విడుదల కాగా.. తమ ఆనందాన్ని వ్యక్త పరచడానికి అభిమానులు థియేటర్స్ లో టపాసులు పేల్చి రచ్చ రచ్చ చేశారు.
Viral Video: సినిమా హీరోలు అంటే ప్రాణమైన ఇచ్చే సినీ ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అయిందంతే చాలు.. పండగల కంటే ఎక్కువ ఆ సినిమా విడుదల రోజుని జరుపుకుంటూ ఉంటారు. అదే కనుక పండుగ రోజు తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకా ఆ అభిమానుల హడావిడి గురించి చెప్పాలా ఏంటి. ఆ పండుగ ఉత్సాహం అంతా ఆ థియేటర్స్ లోనే ఉంటుంది.
ఇక అలాగే ఇప్పుడు సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా విషయంలో కూడా జరిగింది. కాగా ఈ సినిమా విడుదలైంది దీపావళి పండుగ సందర్భంగా కావడంతో అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీపావళి పండగ అంటే దీపాలతో పాటు మనకు ముందుగా గుర్తొచ్చేది తపాకాయలు పేల్చడం. ఇప్పుడు ఆ టపాకాయలను ఎత్తుకొని పోయి ఏకంగా థియేటర్లోనే కాల్చారు అభిమానులు.
టైగర్ 3 మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతగానో ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో సినిమా రిలీజవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందులో ఇదే రోజు దీపావళి పండుగ కూడా కావడంతో .. వారి ఆనందం రెట్టింపు అయింది. థియేటర్‌ల ముందు భారీ కటౌట్లు పెట్టి టపాకాయలు పేల్చి నానా హంగామా చేశారు. బయటకాలిస్తే సరే కానీ ఏకంగా లోపల కూడా బాణసంచా కాల్చడం అక్కడ ఉన్న మిగతా వారిని ఎంతో ఇబ్బందికి గురిచేసింది. ఈ రచ్చ మొత్తం మహారాష్ట్రలోని మాలేగావ్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది.
థియేటర్‌లో బాణసంచా కాల్చడం నిషేధం.. అయినా
కానీ కొందరు అత్యుత్సాహంతో థియేటర్ లోపల బాణసంచా కాల్చి రచ్చ చేశారు. కొందరు ఇలా పటాసులు కాల్చడాన్ని ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేశారు. మరికొందరు వీళ్ళ తీరుకి భయపడిపోయారు.మరోపక్క ఈ విషయం పైన పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'దీపావళి పండగను సల్మాన్ సినిమాతో సెలబ్రేట్ చేసుకున్నాం.. ఇది కదా మాకు కావాల్సింది' అని సల్లూభాయ్ అభిమానులు చెప్తుండగా.. సాధారణ నేటిజన్స్ మాత్రం ఇలా చేసి ఇతరులకు అసౌకర్యానికి గురి చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook