Samantha Great Words about Allu Arha: అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ మనవరాలు అల్లు అర్జున్ కుమార్తె అయిన అర్హ సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమా ద్వారా భరతుడి పాత్రలో నటిస్తోంది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుణశేఖర్ ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంతుని పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్వయంగా గుణ టీం వర్క్ బ్యానర్ మీద నిర్మించబడిన ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న సినిమాని 3d ఫార్మాట్లో రిలీజ్ చేస్తే ఇంకా కిక్ వస్తుందని భావించిన గుణశేఖర్ సినిమాని 3d ఫార్మాట్ లోకి మార్చేందుకు సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు.


ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14వ తేదీన ఐదు భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దిల్ రాజు ఈ సినిమాని సమర్పిస్తూ ఉండడంతో మిగతా భాషల వారికి కూడా సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్టుగా సమంత క్రేజ్ కూడా ఈ సినిమాకు మరింత ఉపయోగపడుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా మొదలయ్యాయి. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూ చేసింది, ఈ ఇంటర్వ్యూలో సుమ అల్లు అర్హతో అనుభవం ఎలా ఉందని ప్రశ్నిస్తే సమంత ఎక్సైట్ అయితూ అల్లు అర్హతతో తన అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం చేసింది. ఆమెను చూసిన మొదటి రోజు నుంచి చాలా ముచ్చట వేసేదని చాలా క్యూట్ గా పాపం ఉండేదని చెప్పుకొచ్చింది సమంత.


అలాగే సెట్ లోకి వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండేదని అందరినీ నవ్విస్తూ ఉండేదని ఆమె పేర్కొంది. అంతేకాక ఆమెకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదని చిన్నప్పుడు మదర్ లాంగ్వేజ్ మీద పూర్తిస్థాయిలో పట్టు రావడం కోసం అల్లు అర్జున్ స్నేహ దంపతులు అర్హను ఇంగ్లీష్ కి దూరంగా ఉంచి తెలుగు పూర్తిస్థాయిలో నేర్పించారని ఆమెకు హాయ్ బాయ్ అనేవి కూడా ఇంగ్లీషులో అనడం రాదని తెలుగులోనే అందరిని చక్కగా పలకరిస్తుందని అల్లు అర్జున్ పెంపకం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది సమంత. దీంతో బన్నీ అభిమానులు అర్హ గురించి సమంత చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


Also Read: Anushka Shetty Angry: ప్రభాస్ పై అనుష్క ఆగ్రహం.. ఆ విషయంలో హర్ట్ అవడంతో ఇక కలిసి నటించకూడదని నిర్ణయం?


Also Read: Karan Johar on Deverakonda: విజయ్ దేవరకొండతో కరణ్ అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి సంచలన ట్వీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook